Jasprit Bumrah: సిరాజ్ లాంటి వాళ్లు చాలు.. బూమ్రాతో పనిలేదు.. మాజీ బౌలర్ షాకింగ్ కామెంట్స్
Jasprit Bumrah: కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో, యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను డ్రా చేసుకోవడంలో విజయం సాధించింది.
Jasprit Bumrah: సిరాజ్ లాంటి వాళ్లు చాలు.. బూమ్రాతో పనిలేదు.. మాజీ బౌలర్ షాకింగ్ కామెంట్స్
Jasprit Bumrah: కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో, యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను డ్రా చేసుకోవడంలో విజయం సాధించింది. అయితే, ఈ సిరీస్ ముగిసిన తర్వాత కూడా ఒక విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది. అదే స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్, అతడి వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్. ఈ విషయంపై ఎక్స్‌పర్ట్స్‌తో పాటు అభిమానులు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. తాజాగా, ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటి పనేసర్ ఈ వివాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిరాజ్ లాంటి బౌలర్లు మ్యాచ్‌లను గెలిపించగలరు కాబట్టి, బుమ్రాకు ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాని అన్నారు.
ఇంగ్లాండ్‌తో జరిగిన 5 టెస్టుల సిరీస్‌లో బుమ్రా కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే ఆడాడు. ఈ టూర్‌కు ముందే బుమ్రా 3 మ్యాచ్‌లలో మాత్రమే ఆడతాడని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. అయితే, బుమ్రా ఆడిన ఆ మూడు మ్యాచ్‌లలో టీమ్ ఇండియా ఒక్కటి కూడా గెలవలేకపోవడం యాదృచ్ఛికం. కానీ, టీమ్ ఇండియా సిరీస్‌ను డ్రా చేసుకోవడానికి ఉపయోగపడిన రెండు మ్యాచ్‌లలో మాత్రం బుమ్రా జట్టులో లేడు. ఆ రెండు మ్యాచ్‌లలో బౌలింగ్ విభాగంలో మొహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించి 5 వికెట్ల చొప్పున తీసి జట్టును ముందుండి నడిపించాడు. ఈ పరిణామంతో బుమ్రా ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై పూర్తిగా ఆధారపడవచ్చా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతడికి ఈ రకమైన ఫ్రీడమ్ ఇవ్వడం సరైనదేనా అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది.
బుమ్రా గొప్పతనం, అతడి స్పెషాలిటీ దృష్ట్యా ఈ విషయంపై చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత సంతతికి చెందిన ఇంగ్లీష్ స్పిన్నర్ మాంటి పనేసర్ కూడా దీనిపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, టీమ్ ఇండియా బుమ్రా లేకుండా ఆడాలా లేక అతన్ని విదేశీ టూర్లలో మాత్రమే ఆడించాలా అని పనేసర్‌ను అడిగారు. దీనికి సమాధానంగా, బుమ్రాను కేవలం విదేశీ టెస్టుల్లో మాత్రమే ఆడించాలని ఆయన సూచించారు.
పనేసర్ ఇచ్చిన ఈ సలహాను కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పాటిస్తారా లేదా అనేది మరో రెండు నెలల్లో తెలుస్తుంది. టీమ్ ఇండియా త్వరలో వెస్టిండీస్‌తో, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో స్వదేశంలోనే రెండు టెస్ట్ సిరీస్‌లు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లలో బుమ్రా ఆడతాడా లేదా అతనికి విశ్రాంతినిస్తారా అనేది టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహాన్ని తెలుపుతుంది. గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కూడా ఇలాంటి విధానం కనిపించింది. బుమ్రా తన టెస్ట్ కెరీర్ ప్రారంభంలో కేవలం విదేశీ మ్యాచ్‌లలో మాత్రమే ఆడి, స్వదేశంలో జరిగే మ్యాచ్‌లలో విశ్రాంతి తీసుకునేవాడు. ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరిస్తారేమో చూడాలి.