Yuzvendra Chahal: ధనశ్రీకి బ్రేకప్ చెప్పేశాక.. చహల్ మనసు దోచుకున్న ఆ అమ్మాయి ఎవరు?
Yuzvendra Chahal: టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కొద్ది రోజుల క్రితమే తన భార్య ధనశ్రీతో విడిపోయిన చహల్, ఇప్పుడు మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Yuzvendra Chahal: ధనశ్రీకి బ్రేకప్ చెప్పేశాక.. చహల్ మనసు దోచుకున్న ఆ అమ్మాయి ఎవరు?
Yuzvendra Chahal: టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కొద్ది రోజుల క్రితమే తన భార్య ధనశ్రీతో విడిపోయిన చహల్, ఇప్పుడు మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్‌జే మహ్వాష్‌తో చహల్ చనువుగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా వీరిద్దరూ కలిసి విమానాశ్రయంలో కనిపించడంతో డేటింగ్ రూమర్లు మరింత బలపడ్డాయి. ఇంతకీ ఎవరీ ఆర్‌జే మహ్వాష్? చహల్‌తో ఆమె బంధం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో క్రికెటర్ యజువేంద్ర చహల్‌తో కలిసి కనిపించినప్పటి నుండి సోషల్ మీడియా స్టార్ ఆర్‌జే మహ్వాష్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లకు ఆమె క్రమం తప్పకుండా హాజరుకావడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్లు మరింత బలపడుతున్నాయి. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు చండీగఢ్ విమానాశ్రయంలో ఆర్‌జే మహ్వాష్ చహల్‌తో కలిసి కనిపించారు. ఇతర పంజాబ్ కింగ్స్ సహచరులతో కలిసి వారు టీమ్ బస్సు ఎక్కుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది.
చండీగఢ్ విమానాశ్రయం నుండి ఇతర జట్టు సభ్యులతో కలిసి బయలుదేరుతున్న సమయంలో, రూమర్డ్ జంట యజువేంద్ర, మహ్వాష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో హ్యాపీగా కనిపించారు. వారు టీమ్ బస్సు వైపు వెళ్తుండగా ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
యజువేంద్ర చహల్ 2020లో ఇన్ఫ్లుయెన్సర్, కొరియోగ్రాఫర్ ధనశ్రీని వివాహం చేసుకున్నారు. అయితే మార్చి 20, 2025న వారు అధికారికంగా విడిపోయినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చహల్, మహ్వాష్‌ల మధ్య డేటింగ్ రూమర్లు ఆన్‌లైన్‌లో చాలా నెలలుగా చక్కర్లు కొడుతున్నాయి. మహ్వాష్ తరచుగా ఐపీఎల్ 2025 సీజన్‌లో చహల్ జట్టు పంజాబ్ కింగ్స్‌కు మద్దతు తెలుపుతూ కనిపించారు. మొహాలిలో చహల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన తర్వాత, మహ్వాష్ అతనితో సెల్ఫీ దిగి "టాలెంటెడ్ మ్యాన్" అంటూ బహిరంగంగా ప్రశంసించారు.
శుక్రవారం తమ సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు ఆదివారం న్యూ చండీగఢ్‌లో జరిగే ఐపీఎల్ 2025లోని 37వ మ్యాచ్‌లో మరోసారి ఆర్‌సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సీజన్‌లో డబుల్ పూర్తి చేయాలని పంజాబ్ భావిస్తోంది.