Dhanashree Verma: ఆడవారిని నిందించడం ఫ్యాషన్ అయింది.. ధనశ్రీ వర్మ ఆసక్తికర పోస్ట్ వైరల్

టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల వీరికి విడాకులు మంజూరైనట్టు వార్తలు వచ్చాయి.

Update: 2025-03-11 06:24 GMT

ఆడవారిని నిందించడం ఫ్యాషన్ అయింది.. ధనశ్రీ వర్మ ఆసక్తికర పోస్ట్ వైరల్

Dhanashree Verma: టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో తరచూ వీరు వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల వీరికి విడాకులు మంజూరైనట్టు వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాదని.. విడాకుల వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని ధనశ్రీ వర్మ లాయర్ వివరణ ఇవ్వడంతో ఆ వార్తలకు బ్రేక్ పడింది. ఇక ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను చాహల్ ఓ అమ్మాయితో కలిసి వీక్షించడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

ఒకవైపు దేశమంతా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సంబరాల్లో ఉంటే.. మరోవైపు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ గురించి కూడా అంతే చర్చ నడుస్తోంది. దీనికి కారణం చాహల్ సోషల్ మీడియా స్టార్, రేడియో జాకీ మహవష్‌తో జంటగా కనిపించాడు. దీంతో చాహల్-వర్మ విడిపోవడానికి ఈ అమ్మాయే కారణం అని రూమర్లు మొదలయ్యాయి.

స్టేడియంలో ఇద్దరూ ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ధనశ్రీ వర్మ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. మహిళలను నిందించడం ఎప్పుడూ ఫ్యాషనే అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టుకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. విడాకుల వార్తల విషయంలో తనపై వస్తున్న ట్రోల్స్‌కు ఆమె ఇలా స్పందించారంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ధనశ్రీ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

చాహల్, ధనశ్రీ 2020లో వివాహం చేసుకున్నారు. కొరియోగ్రాఫర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ధనశ్రీ.. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరించేవారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ జంట.. గతంలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి గురిచేశాయి. సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకోవడం. ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ పేరును తీసేయడంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ రూమర్స్ వ్యాపించాయి.

అంతేకాదు ధనశ్రీ, చాహల్ జంట ఇటీవల కోర్టుకు హాజరైనట్టు కథనాలు వచ్చాయి. వీరిద్దరికి 45 నిమిషాలు పాటు కౌన్సిలింగ్ ఇచ్చిన జడ్జి విడిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నారని.. పరస్పర అంగీకారంతో జడ్జి విడాకులకు ఆమోదం తెలిపినట్టు తెలిసింది. ధనశ్రీ భరణంగా రూ.60 కోట్లు డిమాండ్ చేసినట్టు వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై స్పందించిన ధనశ్రీ లాయర్.. న్యాయపరమైన ప్రక్రియపై అప్పుడే మాట్లాడడం సరికాదని.. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందన్నారు. కథనాలు రాసేముందు వాస్తవాలు తెలుసుకోవాలని.. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకూడదని అన్నారు. 

Tags:    

Similar News