CSK vs PBKS: బ్యాటింగ్ లో తడబడిన చెన్నై బౌలింగ్ లో నిలబడుతుందా..!?

* బౌలింగ్ లో రాణించిన పంజాబ్ కింగ్స్

Update: 2021-10-07 12:06 GMT

బ్యాటింగ్ లో తడబడిన చెన్నై బౌలింగ్ లో నిలబడుతుందా..!? (ట్విట్టర్ ఫోటో)


CSK vs PBKS: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ జట్టు తమ బౌలింగ్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 20 ఓవర్లు ముగిసే సమయానికి 134/6 పరుగులకే కట్టడి చేసింది. చెన్నై ఓపెనర్ డు ప్లెసిస్ (76) మినహా మిగిలిన ఆటగాళ్ళు ఎవరు రాణించకపోవడంతో చెన్నై తక్కువ పరుగులకే పరిమితం అయింది.

మొయిన్ అలీ, ఉతప్ప, రాయుడు సింగల్ డిజిట్ కే పెవిలియన్ చేరడంతో పాటు కెప్టెన్ ధోని మరోసారి తన బ్యాటింగ్ తో అభిమానులను నిరాశ పరిచాడు. పంజాబ్ బౌలింగ్ లో ఆర్షదీప్ సింగ్, క్రిస్ జోర్డాన్ తల రెండు వికెట్లు పడగొట్టగా, శమి, రవి బిష్ణోయ్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. మరి బ్యాటింగ్ లో విఫలం అయిన ధోని సేన బౌలింగ్ తో ఆకట్టుకొని మ్యాచ్ లో విజయం సాధిస్తుందో లేదో మరికాసేపట్లో తెలియనుంది.

చెన్నై సూపర్ కింగ్స్ : 134/6 (20 ఓవర్లు)

డుప్లెసిస్ (76)

జడేజా 15 నాటౌట్

కలకత్తా నైట్ రైడర్స్ :

ఆర్షదీప్ సింగ్ 4 -0- 35 - 2

క్రిస్ జోర్డాన్ 3- 0- 20- 2

Tags:    

Similar News