Cricket History: ఒకే మ్యాచ్‌లో మూడు సూపర్ ఓవర్లు.. ఊపిరి బిగబట్టి చూసిన ఫ్యాన్స్!
Cricket History: క్రికెట్ మ్యాచ్‌కి ఉండే కిక్కే వేరు కదా, కొన్నిసార్లు మ్యాచ్ టై అయినా, ఒక్క సూపర్ ఓవర్ తోనే గెలుపోటములు తేలిపోతుంటాయి. కానీ, స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న టి20 ట్రై సిరీస్ 2025లో చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ జరిగింది.
Cricket History: ఒకే మ్యాచ్‌లో మూడు సూపర్ ఓవర్లు.. ఊపిరి బిగబట్టి చూసిన ఫ్యాన్స్!
Cricket History: క్రికెట్ మ్యాచ్‌కి ఉండే కిక్కే వేరు కదా, కొన్నిసార్లు మ్యాచ్ టై అయినా, ఒక్క సూపర్ ఓవర్ తోనే గెలుపోటములు తేలిపోతుంటాయి. కానీ, స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న టి20 ట్రై సిరీస్ 2025లో చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ జరిగింది. నేపాల్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన రెండో T20 మ్యాచ్ టై అవ్వడమే కాకుండా, ఏకంగా మూడు సూపర్ ఓవర్ల తర్వాత విజేత ఎవరనేది తేలింది. క్రికెట్ చరిత్రలో ఇలా మూడు సూపర్ ఓవర్లు జరిగిన T20 మ్యాచ్ ఇదే మొదటిసారి, ఇది క్రికెట్ అభిమానులను ఉత్కంఠను పీక్ స్టేజీకి తీసుకెళ్లింది. ఈ ఉత్కంఠభరితమైన పోరు టిట్‌వుడ్ మైదానంలో జరిగింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. నేపాల్ స్పిన్నర్లు, ముఖ్యంగా సందీప్ లమిచానే, లలిత్ రాజబన్షి, అద్భుతమైన బౌలింగ్ చేసి నెదర్లాండ్స్‌ను పెద్ద స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. నెదర్లాండ్స్ ఇచ్చిన 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో నేపాల్ జట్టు కూడా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 152 పరుగులే చేసింది. చివరి బంతికి నందన్ యాదవ్ ఫోర్ కొట్టి స్కోరును సమం చేయడంతో మ్యాచ్ టై అయ్యి, సూపర్ ఓవర్‌కి దారితీసింది. అప్పటిదాకా టెన్షన్ పడ్డ ఫ్యాన్స్‌కి, ఇది మరింత ఉత్కంఠను పెంచింది.
మొదటి సూపర్ ఓవర్: నేపాల్ మొదట బ్యాటింగ్ చేసి 19 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ కూడా దానికి బదులుగా సరిగ్గా 19 పరుగులే చేసి, సూపర్ ఓవర్‌ను కూడా టై చేసింది.
రెండో సూపర్ ఓవర్: టెన్షన్ డబుల్ అయింది. రెండు జట్లు మళ్ళీ సమానంగా 17-17 పరుగులు చేశాయి. దీంతో మ్యాచ్ మూడో సూపర్ ఓవర్‌కి వెళ్ళింది. ఇది నిజంగా అద్భుతం!
మూడో సూపర్ ఓవర్: చివరికి, మూడో సూపర్ ఓవర్‌లో నేపాల్ జట్టు కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండానే తమ రెండు వికెట్లను కోల్పోయింది. తర్వాత నెదర్లాండ్స్ జట్టు మొదటి బంతికి సిక్స్ కొట్టి మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.
నెదర్లాండ్స్ తరపున ఈ మ్యాచ్‌లో తేజా నిడమనూర్ అత్యధికంగా 35 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. విక్రమ్జిత్ సింగ్ 30 పరుగులు చేయగా, సాకిబ్ జుల్ఫికార్ కూడా 25 పరుగుల విలువైన సహకారం అందించాడు. బౌలింగ్‌లో డానియల్ డోరమ్ అద్భుతంగా రాణించాడు. అతను 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. విక్రమ్జిత్ సింగ్ కూడా 2 వికెట్లు తీశాడు. జాక్ లయన్-కాషెట్, బెన్ ఫ్లెచర్, కైల్ క్లెయిన్‌లకు చెరో వికెట్ లభించాయి.
మ్యాచ్ టై అయినప్పుడు విజేతను తేల్చడానికి సూపర్ ఓవర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. సాధారణంగా ఒకే సూపర్ ఓవర్ సరిపోతుంది. కానీ ఈ మ్యాచ్‌లో మూడు సూపర్ ఓవర్లు జరగడం క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభూతిని ఇచ్చింది.