IPL 2023: పరువు నిలుపుకోవాలని హైదరాబాద్.. చావో రేవో తేల్చుకోవాలని బెంగళూరు.. నేడే ఉత్కంఠ పోరు

*ఒకరిది పరువు నిలుపుకోవాలని ఆరాటం..మరొకరిది ప్లే ఆఫ్స్ కు చేరాలనే పోరాటం..ఈ ఉత్కంఠ పోరుకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మారింది. గురువారం సాయంత్రం 7:30 గంటలకు షెడ్యూల్ అయిన హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ పైనే అందరి దృషి..

Update: 2023-05-18 05:37 GMT

IPL 2023: పరువు నిలుపుకోవాలని హైదరాబాద్.. చావో రేవో తేల్చుకోవాలని బెంగళూరు.. నేడే ఉత్కంఠ పోరు

IPL 2023: ప్లే ఆఫ్స్ రేసు నుంచి హైదరాబాద్ సన్ రైజర్స్ నిష్క్రమించింది. అయినా ఆ జట్టు ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల ఫలితాలపైనే ఇతర జట్ల ప్లే ఆఫ్స్ ఆధారపడి ఉన్నాయి. అందుకే, హైదరాబాద్ ఆడే మ్యాచులపై ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ తన సొంత గడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో ఇవాళ తలపడనుంది. సొంత అభిమానుల మధ్య గెలిచి పరువు నిలుపుకోవాలని హైదరాబాద్ సన్ రైజర్స్ భావిస్తుంటే..బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. అందుకే హైదరాబాద్-బెంగళూరు మ్యాచ్ పై అందరు ఫోకస్ చేశారు.

వాస్తవానికి, ఈ మ్యాచ్ ఓడిపోయినా బెంగళూరు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగానే ఉంటాయి. చివరి లీగ్ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి..ఒకవేళ గెలిచినా, ఇతర జట్ల ఫలితాలు బెంగళూరు ప్లే ఆఫ్స్ ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే, హైదరాబాద్ పై గెలిచి తన ప్లే ఆఫ్స్ ను మెరుగుపర్చుకోవాలని బెంగళూరు జట్టు తలపోస్తోంది. కెప్టెన్ డుప్లెసిస్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్ వెల్ ఫామ్ లో ఉండడం బెంగళూరు జట్టుకు సానుకూలాంశంగా ఉంది. గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై గెలుపొంది బెంగళూరు సమరోత్సాహంతో ఉంది. మరి, ఈ జట్టును హైదరాబాద్ నిలువరిస్తుందో లేదో చూడాలి.

ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాలను చెన్నై సూపర్ కింగ్స్, లఖ్ నవూ సూపర్ జెయింట్స్, ముంబై ఇండియెన్స్ వరుసగా ఆక్రమించాయి. 

Tags:    

Similar News