IPL 2021: జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శన; బెంగళూరుపై చెన్నై ఘన విజయం

IPL 2021 CSK vs RCB: రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెన్నై టీం బెంగళూరుపై పై చేయి సాధించింది.

Update: 2021-04-25 13:51 GMT

IPL 2021 CSK vs RCB: రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెన్నై టీం బెంగళూరుపై పై చేయి సాధించింది. అన్ని రంగాల్లో ప్రతిభ చూపిన చెన్నై టీం 69 పరుగుల తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా(62 నాటౌట్, 3 వికెట్లు) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.

192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ కోహ్లి(8) రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. సామ్‌ కరన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ తొలి బంతిని కోహ్లి ఆడే ప్రయత్నంలో కీపర్‌ ధోనికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ పడిక్కల్‌ ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సర్లతో దంచికొట్టాడు.

మంచి ఊపులో కనిపించినా థాకూర్ బౌలింగ్ పడిక్కల్(34 పరుగులు, 15 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) రైనాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన వాషింటన్ సుందర్(7) మరోసారి విఫలమయ్యాడు. మధ్యలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (22 పరుగులు, 15 బంతులు, 3ఫోర్లు) అలరించాడు. కానీ, వెంటవెంటనే రవీంద్ర జడేబా రెండు వికెట్లు పడగొట్టి బెంగళూరును కోలుకోనివ్వకుండా చేశాడు. ఇక ఆ తరువాత వరుస ఓవర్లలో బెంగళూరు వికెట్లు కొల్పోయి, కనీసం పోటీ ఇవ్వకుండానే సింగిల్ డిజట్లకే పరిమితమయ్యారు బ్యాట్స్‌మెన్స్.

ఇక చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్లు, తాహీర్ 2 వికెట్లు, సామ్ కర్రన్, థాకూర్ చెరో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌(33; 25 బంతుల్లో 4x4, 1x6), డుప్లెసిస్‌(50; 41 బంతుల్లో 5x4, 1x6) శుభారంభం చేశారు. ఆపై సురేశ్‌ రైనా(24; 18 బంతుల్లో 1x4, 3x6), రవీంద్ర జడేజా(62*; 28 బంతుల్లో 4x4, 5x6) మెరిశారు. కాగా, హర్షల్‌ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో జడ్డూ రెచ్చిపోయాడు. ఐదు సిక్సులు, ఒక బౌండరీ, ఒక డబుల్‌ రన్‌తో పాటు ఒక నోబాల్‌ పడటంతో మొత్తం 37 పరుగులు వచ్చాయి. బెంగళూరు బౌలర్లలో హర్షల్‌ మూడు వికెట్లు తీయగా చాహల్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

Tags:    

Similar News