IPL 2021: ఐపీఎల్ లో కోల్‌కతాపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
IPL 2021: 172 పరుగుల లక్ష్యాన్ని 8వికెట్లు కోల్పోయి చేధించిన చెన్నై
కోల్కతా పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం (ఫైల్ ఇమేజ్)
IPL 2021: అసలు సిసలు థ్రిల్లింగ్ మ్యాచ్ కు ఐపీఎల్ వేదికైంది. కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో చివరి బంతికి చెన్నై విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని 8వికెట్లు కోల్పోయి చేధించింది. ఓ దశలో 142 పరుగులకే 6వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ధోనీ సేన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విజృంభణతో గెలుపు తలుపు తట్టింది. జడేజా కేవలం 8బంతుల్లోనే రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 22 రన్స్ సాధించాడు. ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి 4 పరుగులు అవసరం అయిన వేళ.. కోల్ కతా స్పిన్నర్ సునీల్ నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో చివరి బంతికి దీపక్ చాహర్ సింగిల్ తీయడంతో చెన్నైను విజయం వరించింది.