Jersey 8758: ఆటగాళ్ళ స్ఫూర్తి కోసం చెన్నై సూపర్ కింగ్స్ స్పెషల్ జెర్సీ

Update: 2021-08-08 09:59 GMT

చెన్నై సూపర్ కింగ్స్ - నీరజ్ చోప్రా (ఫైల్ ఫోటో)

Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా ఘనతని గుర్తు ఉంచుకునేలా తన గౌరవార్ధం ఒక కొత్త జెర్సీని తయారు చేసింది. జోవెలిన్ త్రోలో నీరజ్ చోప్రా సంధించిన 87:58 మీటర్ల దూరానికి గాను భారత్ కి పసిడి సాధించి పెట్టడంతో "8758" నెంబర్ తో జెర్సీని చేయడంతో పాటు అతనికి కోటీ రూపాయల నజరానా ప్రకటించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం. అయితే ఈ జెర్సీ ని ఆటగాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ లో ఉంచబోతున్నట్లు తెలిపారు. ఆ జెర్సీ ని చూసినపుడు ఆటగాళ్ళకు నీరజ్ చోప్రా ఆటతో భారత్ కి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన స్ఫూర్తి గుర్తు ఉండేలా ప్రతి మ్యాచ్ కి ఈ జెర్సీని తీసుకు వెళ్లనున్నట్లు టీం మేనేజ్మెంట్ ప్రకటించింది.

ఇక సెప్టెంబర్ నెల 19న అరబ్ దేశాల్లో జరగబోయే రెండో దశ ఐపీఎల్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తో చెన్నై జట్టు ఈ జెర్సీని టీం డ్రెస్సింగ్ లో ఒక ప్రత్యేక స్థానంలో ఉంచబోతున్నట్లు తెలుస్తుంది. ఇక అథ్లెటిక్స్ లో బంగారు పతకాన్ని సాధించి 100 ఏళ్ళ కలను నేరవేర్చిన నీరజ్ చోప్రాకి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నజరానాతో పాటు దేశవ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.



Tags:    

Similar News