IPL 2022: రెండు టీమ్స్ ఫ్రాంచైజ్ కోసం 6 నగరాల పోటీ
* లక్నో, కటక్, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్, ధర్మశాల నగరాలలో ఏవైనా రెండు నగరాలను మనం 2022 ఐపీఎల్ మ్యాచ్ లలో చూడబోతున్నాం.
ఐపీఎల్ 2022 (ట్విట్టర్ ఫోటో)
IPL 2022 : ఐపీఎల్ 2022 లో కొత్త టీమ్స్ కోసం బిసిసిఐ కసరత్తు ప్రారంభించింది. 2022 లో ఇప్పుడున్న 8 టీమ్స్ కి మరో రెండు టీమ్స్ ని కలిపి 10 జట్లతో ప్రారంభిస్తామని ఇప్పటికే బిసిసిఐ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఆ రెండు స్థానాల కోసం 6 నగరాలను బీసీసీఐ షార్ట్ లిస్టు చేసిన్నట్లు సమాచారం.. రెండు వేల కోట్ల బేస్ ప్రైజ్ తో ఒక్కో టీమ్ ని తీసుకోనుంది. లక్నో, కటక్, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్, ధర్మశాల నగరాలలో ఏవైనా రెండు నగరాలను మనం 2022లో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ లలో చూడబోతున్నాం.
నార్త్ నుండి ధర్మశాల నగరం, వెస్ట్ జోన్ నుండి అహ్మదాబాద్, సెంట్రల్ జోన్ నుండి లక్నో, ఈస్ట్ జోన్ నుండి కటక్, రాంచీ, గౌహతిలను ఈస్ట్ నుండి ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నగరాల్లో అహ్మదాబాద్ తో పాటు లక్నో, కటక్, గౌహతి నుండి మరొక టీం ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ పూర్తయిన తర్వాత అరబ్ లో జరగనున్న ఐపీఎల్ రెండో దశ కోసం మ్యాచ్ ల నిర్వహణకు బిసిసిఐ సిద్దం అవుతుంది.