BCCI Women's Contract List: ఉమెన్స్‌ టీంలో ఆ ముగ్గురికి మరోసారి A గ్రేడ్

BCCI: మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్‌ని బీసీసీఐ విడుదల చేసింది. క్రికెటర్లని ఏ, బీ, సీ గ్రేడ్‌లుగా విభజించింది.

Update: 2021-05-20 07:59 GMT

బీసీసీఐ ఉమెన్స్ ప్లేయర్స్ (ఫొటో ట్విట్టర్)

BCCI Women's Contract List: బీసీసీఐ నేడు మహిళా క్రికెటర్ల వార్షిక కాంట్రాక్ట్‌ని విడుదల చేసింది. ఈ లిస్టులో క్రికెటర్లని ఏ, బీ, సీ గ్రేడ్‌లుగా విభజించింది. ఏ గ్రేడ్‌లో పొట్టి క్రికెట్ టీం సారథి హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధనా, అలాగే స్పిన్నర్ పూనమ్ యాదవ్‌ లు ఉన్నారు. గతేడాది కూడా వీరు ఏ గ్రేడ్ లోనే ఉన్నారు. ఈ ముగ్గురికి బీసీసీఐ నుంచి ఏడాదికి రూ.50 లక్షలు అందనున్నాయి.

బీ గ్రేడ్‌లో వన్డే టీం సారథి మిథాలీ రాజ్‌తో, దీప్తి శర్మ, ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామి, పూనమ్ రౌత్, శిఖ పాండే, షఫాలి వర్మ, రాజేశ్వర్ గైక్వాడ్, రాధ యాదవ్, తనియా భాటియా, జెమీమా రోడ్రిగ్స్‌ ఉన్నారు. వీరికి రూ.30 లక్షలు దక్కనున్నాయి.

ఇక సీ గ్రేడ్‌లో మాన్షి జోషి, అరుధంతి రెడ్డి, ప్రియా పునియా, రిచా ఘోష్‌, పూజా, హార్లీన్ డోయల్ చోటు సాధించారు. వీరికి రూ.10 లక్షలు అందనున్నాయి. అయతే, గతేడాది 22 మంది క్రికెటర్లకి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చిన బీసీసీఐ.. ఈ ఏడాది 19 మందికే అందించింది. కాగా, ఏక్తా బిస్త్‌ సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకోలేక పోయారు.


Tags:    

Similar News