Babar Azam: కెప్టెన్సీకి బాబర్ ఆజమ్ గుడ్ బై

Babar Azam: కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటన

Update: 2023-11-16 01:57 GMT

Babar Azam: కెప్టెన్సీకి బాబర్ ఆజమ్ గుడ్ బై

Babar Azam: ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యంతో.. లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్థాన్‌పై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ పదవికి.. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. మూడు ఫార్మాట్లలోనూ పాకిస్థాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా.... ఇది చాలా కఠిన నిర్ణయం.

కానీ తప్పుకోవడానికి ఇదే సరైస సమయమని అనిపిస్తోంది. కెప్టెన్ పదవికి రాజీనామా చేసినప్పటికీ అన్ని ఫార్మాట్లలోనూ ప్లేయర్‌గా కొనసాగుతా... కెప్టెన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించినా వారికి సహకారం ఉంటుంది. జట్టుకోసం అనుభవాన్ని వినియోగిస్తూ.. అంకితభావంతో పనిచేస్తా. ఈ అవకాశం ఇచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు".. అంటూ బాబర్ ఆజమ్ ట్వీట్ చేశాడు. అయితే టెస్టు జట్టుకు షాన్ మసూద్‌ను, టీ20లకు షహీన్ షా ఆఫ్రిదిని కెప్టెన్లుగా పీసీబీ నియమించింది.

Tags:    

Similar News