IPL: ఐపీఎల్‌కు వార్నర్‌ దూరం?

Update: 2021-02-22 16:32 GMT

వార్నర్ (ఫోటో వార్నర్ ఫేస్బుక్ )

IPL: గాయాల నుంచి కోలుకోవడానికి మరో ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని ఆసీస్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, త్వరగా కోలుకునే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపాడు. ''కొన్ని వారాలుగా త్రో వేయడానికి కూడా చాలా బాధపడేవాడిని. అయితే వచ్చే వారం నుంచి త్రో వేయడం ప్రారంభిస్తాను. వికెట్ల మధ్య పరిగెత్తడమే ప్రస్తుతం సమస్యగా మారింది. గజ్జల్లో గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి తొమ్మిది నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.''

కాగా, భారత్ లో మరో రెండు నెలల్లో ఐపీఎల్‌-14వ సీజన్‌ ప్రారంభం కానుంది. గాయంతో వార్నర్‌ ఐపీఎల్‌కు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు వార్నర్‌ కెప్టెన్ గా బాధ్యతలు వహిస్తున్నాడు. హైదరాబాద్‌ జట్టులో డేవిడ్ వార్నర్‌ ముఖ్యమైన ఆటగాడు. కాగా, ఆసీస్ టూర్ లో భారత్‌తో జరిగిన రెండో వన్డేలో అతను గాయపడిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తుండగా గజ్జల్లో గాయమవ్వడంతో మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత భారత్ తో టీ20 సిరీస్‌కు దూరమైనా, టెస్టు సిరీస్‌ ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్‌కు వార్నర్ దూరమయ్యాడు.

Tags:    

Similar News