IND vs AUS: తొలి వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా మహిళలు గెలిచారు
IND vs AUS: 6వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ సేన ఓటమి
IND vs AUS: తొలి వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా మహిళలు గెలిచారు
IND vs AUS: ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా గెలుపొందింది. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో 6 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ సేనను ఓడించింది. భారత్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్య ఛేదనలో యువకెరటం ఫొబె లిచ్‌ఫీల్డ్ 78, ఎలిసా పెర్రీ 75, ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్ 68 పరుగులతో మెరిశారు. దాంతో, ఆసీస్ భారీ టార్గెట్‌ను 46.3 ఓవర్లలోనే ఛేదించింది. రికార్డుల పరంగా చూస్తే.. మహిళల క్రికెట్‌లో ఇది రెండో అత్యధిక ఛేదన. ఆసీస్ తొలి ఓవర్లోనే ఒక వికెట్ కోల్పోయింది. రేణుకా సింగ్ ఓవర్లో ఓపెనర్ హేలీ ఔటయ్యింది. కానీ, ఎలిసా పెర్రీ, ఫొబే లిచ్‌ఫీల్డ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి పైచేయి సాధించారు. వీళ్లు రెండో వికెట్‌కు 148 పరుగులు జోడించి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అనంతరం బేత్ మూనీతో కలిసి మెక్‌గ్రాత్ 68 పరుగులతో జట్టును విజయం వైపు నడిపించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.