IPL 2025: ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో లక్షలాది ఫాలోవర్లు సొంతం.. దటీజ్ ధోనీ ఫ్యాన్ గర్ల్!
IPL 2025, Arya Priya: ఓటమి బాధలోనూ ఒక చిరునవ్వు.. ఆర్య ప్రియ రూపంలో చెన్నై అభిమానులకు వచ్చిన ఊరట. ఒక ఎమోషన్ కాసేపులో ఒక యువతిని స్టార్‌గా మార్చిందంటే, అది ధోని పేరు తెచ్చిన అనుబంధమే.
IPL 2025: ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో లక్షలాది ఫాలోవర్లు సొంతం.. దటీజ్ ధోనీ ఫ్యాన్ గర్ల్!
IPL 2025, Arya Priya: బర్సాపారా స్టేడియం… చివరి ఓవర్లో 16 పరుగుల అవసరం… క్రీజ్‌లో ఎం.ఎస్. ధోని ఉన్నాడు. ఈ దృశ్యం చూసిన చెన్నై అభిమానుల గుండెల్లో మరోసారి ఆశలు మొలకెత్తాయి. కానీ ఈసారి పరిణామం భిన్నంగా మారింది. గతంలో ఓవర్‌లో పరుగులు ఎక్కించడంలో కింగ్‌గా నిలిచిన ధోని ఇప్పుడు మౌనంగా వెనుదిరిగాడు. వయసు కూడా అతనిపై ప్రభావం చూపిస్తోంది. చెన్నై ఓటమి చెందగా, అభిమానులు బాధను దిగమింగారు. కానీ ఈ ఓటమిలోనూ ఓ వెలుగు చూపించింది గువాహటికి చెందిన యువతి ఆర్య ప్రియా.
ఆర్య ప్రియా నిజానికి ఎటువంటి ప్రత్యేక చర్య తీసుకోలేదు. కానీ ధోని ఔట్ అయిన సమయంలో ఆమె ముఖం మీద కనిపించిన అసహనం, నిరాశ, బాధ – ఇవన్నీ కలిసిపోయి ఆమెను నెట్‌జనుల కంట్లో పడేసాయి. ఆమె మౌనం, కోపాన్ని అణచుకున్న హావభావాలు లక్షల మంది ధోని అభిమానులకు తాము ఎదుర్కొంటున్న భావోద్వేగాలే అనిపించాయి. నిమిషాల వ్యవధిలో ఆమె రియాక్షన్ క్లిప్ వైరల్‌గా మారింది.
ఐపీఎల్ మ్యాచ్‌లలో కీలక సందర్భాల్లో కమెరా బృందం అభిమానుల రియాక్షన్‌లను ఫోకస్ చేస్తూ ఉంటుంది. అలాంటి క్రమంలో ఆర్య ప్రియ లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. మ్యాచ్ పూర్తయ్యేలోపు సోషల్ మీడియా ఆమె ఫోటో, వీడియోలతో నిండిపోయింది. ఆమె అభిమానం, చూపులోని ఆవేదనతో అనేక మంది కనెక్ట్ అయ్యారు. అప్పటివరకు ఒకే ఒక వంద ఫాలోవర్లు ఉన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా.. కొన్ని గంటల్లోనే 2.5 లక్షలకు చేరుకుంది. ఇదే సోషల్ మీడియా మాయాజాలం.
ఆర్య ప్రియా ఇన్‌స్టాగ్రామ్‌ను పరిశీలిస్తే.. ఆమె సాధారణంగా ట్రావెల్ ఫోటోలు, స్వీయ చిత్రాలే షేర్ చేస్తుంది. కానీ ఈ ఒక్క మ్యాచ్ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఇకపై ధోని అభిమానుల గుండెల్లో చోటు సంపాదించిన ఆర్య ప్రియా.. సోషల్ మీడియాలో మరిన్ని రియాక్షన్‌లు ఇవ్వనుందా? ధోనికి మద్దతుగా ఇంకెన్ని పోస్టులు వేయనుందా? అన్నది వేచి చూడాల్సిందే.