Tamannaah Bhatia: విరాట్ కోహ్లీతో డేటింగ్ వార్తలపై తమన్నా స్పందన... ఏం చెప్పిందంటే?
Tamannaah Bhatia: టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఇటీవల తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.
Tamannaah Bhatia: విరాట్ కోహ్లీతో డేటింగ్ వార్తలపై తమన్నా స్పందన... ఏం చెప్పిందంటే?
Tamannaah Bhatia: టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఇటీవల తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల నటుడు విజయ్ వర్మతో బ్రేకప్ చేసుకున్న ఆమె, మళ్లీ సింగిల్‌గా ఉంటోంది. అయితే, చాలా సంవత్సరాల క్రితం తమన్నా, క్రికెటర్ విరాట్ కోహ్లీతో డేటింగ్ చేస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలపై తమన్నా స్పందిస్తూ, క్లారిటీ ఇచ్చింది.
కొన్ని సంవత్సరాల క్రితం, తమన్నా, విరాట్ కోహ్లీ ఒక మొబైల్ కంపెనీ ప్రకటనలో కలిసి నటించారు. ఆ తర్వాత వారిద్దరూ తరచుగా కలుసుకుంటున్నారని, డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై తాజాగా స్పందించిన తమన్నా ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. "ఈ విషయం గురించి వినడం నాకు చాలా బాధగా ఉంది. నేను విరాట్ కోహ్లీని కేవలం ఒక్కసారి మాత్రమే కలిశాను. ఆ ప్రకటన షూటింగ్ తర్వాత మేమిద్దరం మళ్లీ ఎప్పుడూ కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు. నా గురించి ఇలాంటి నిరాధారమైన పుకార్లు రావడం చాలా బాధాకరం" అని తమన్నా పేర్కొంది.
విరాట్ కోహ్లీతో మాత్రమే కాదు, తమన్నా పేరు గతంలో పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో కూడా ముడిపడింది. ఒక జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా తమన్నా, అబ్దుల్ రజాక్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనితో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లను కూడా తమన్నా అప్పట్లోనే ఖండించింది.
సినిమా రంగంలోకి అడుగుపెట్టి చాలా సంవత్సరాలు అయినా తమన్నా ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కేవలం కథానాయికగానే కాకుండా, ఐటమ్ డ్యాన్సర్‌గా కూడా ఆమె ప్రేక్షకులను అలరిస్తోంది. 35 ఏళ్ల తమన్నా, ఇటీవల విజయ్ వర్మతో పెళ్లి చేసుకుంటుందనుకున్న సమయంలో వారిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఆమె సింగిల్‌గానే ఉంటోంది.