AB de Villiers: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తన రిటైర్మెంట్ పై ఏబీ డివిలియర్స్ సంచలన ప్రకటన
AB de Villiers: దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన చివరి ఇంటర్నేషన్ మ్యాచ్ ను ఏప్రిల్ 2018లో ఆడాడు.
AB de Villiers: దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన చివరి ఇంటర్నేషన్ మ్యాచ్ ను ఏప్రిల్ 2018లో ఆడాడు. చివరి ప్రొఫెషనల్ మ్యాచ్ 2021లో ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడారు. దీని తర్వాత ఆయన క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. కానీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు డివిలియర్స్ ఒక సంచలన ప్రకటన చేశాడు. మిస్టర్ 360 పేరుతో పాపులర్ అయిన క్రికెటర్. క్రికెట్ మైదానంలోకి తిరిగి వస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
డివిలియర్స్ ఎప్పుడు తిరిగి వస్తాడు?
ఏబీ డివిలియర్స్ ఇటీవల రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ పాడ్‌కాస్ట్‌లో క్రికెట్ లో తన రీఎంట్రీ ఉంటుందని సూచించాడు. ఈ సమయంలో మళ్ళీ క్రికెట్ ఆడాలనే తన మనసులో ఉన్న కోరికను వ్యక్తం చేశాడు. అయితే, అతను ఎప్పుడు మైదానంలోకి తిరిగి వస్తాడనేది ఇంకా ఖరారు కాలేదు. 'నేను త్వరలోనే క్రికెట్ ఆడగలను' అని డివిలియర్స్ అన్నాడు. అయితే, ఇంకా టైం నిర్ణయించలేదు. అతను ఇప్పుడు అంతర్జాతీయ లేదా ఏ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం ఇష్టం లేదని స్పష్టం చేశాడు. అంటే అతను దక్షిణాఫ్రికా తరపున లేదా ఐపీఎల్‌లో ఆడడు. తను ఎక్కడ ఆటను ఎంజాయ్ చేయగలడో అక్కడే ఆడతానని ప్రకటించాడు.
డివిలియర్స్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు?
డివిలియర్స్ మళ్ళీ క్రికెట్ ఆడటానికి అతిపెద్ద కారణం అతని పిల్లలు. తన పిల్లల ఒత్తిడి కారణంగానే తాను ఇలా ఆలోచిస్తున్నానని ఆయన అన్నారు. తాను ఆడటానికి ఫిట్‌గా ఉన్నానో లేదో తెలుసుకోవడానికి త్వరలోనే నెట్స్‌కి వెళ్లి ప్రాక్టీస్ చేస్తానని డివిలియర్స్ వెల్లడించాడు. అతనికి ఒక కంటిలో దృష్టి అస్పష్టంగా ఉంది కానీ మరొక కన్ను పూర్తిగా బాగానే ఉంది. అతను బౌలింగ్ మెషిన్.. బాగా ఆడటంలో సక్సెస్ అయితేనే భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటాడట. తన పిల్లలు, కుటుంబ సభ్యులు తన ఆటను ఆస్వాదించాలని అతను కోరుకుంటున్నాడు.
డివిలియర్స్ కెరీర్
డివిలియర్స్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 114 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి, 50.66 సగటుతో 8765 పరుగులు చేశాడు. అతను 22 సెంచరీలు, 46 అర్ధ సెంచరీలు చేశాడు. 228 వన్డే మ్యాచ్‌ల్లో, అతను 53.50 సగటుతో 9577 పరుగులు సాధించగలిగాడు. ఇందులో 25 సెంచరీలు, 53 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇది కాకుండా, అతను 78 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడాడు, ఇందులో అతను 26.12 సగటుతో, 135 స్ట్రైక్ రేట్‌తో 1672 పరుగులు చేశాడు. డివిలియర్స్ ఐపీఎల్ టోర్నమెంట్‌లో 184 మ్యాచ్‌ల్లో 39.71 సగటు, 151 స్ట్రైక్ రేట్‌తో 5162 పరుగులు చేశాడు. ఇక్కడ అతను 3 సెంచరీలు, 40 అర్ధ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ మొదటి మూడు సీజన్లలో డివిలియర్స్ ఢిల్లీ జట్టు తరపున ఆడాడు, ఆ తర్వాత అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వెళ్లి చివరి వరకు వారితోనే ఆడారు. అనుబంధం కలిగి ఉన్నాడు.