IND vs OMAN : టీమిండియాకే చుక్కలు చూపించిన ఒమన్ ఆటగాడు..హాఫ్ సెంచరీతో సరికొత్త చరిత్ర సృష్టించాడు

IND vs OMAN : ఆసియా కప్ 2025లో ఇండియా, ఓమన్ మధ్య జరిగిన చారిత్రక మ్యాచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది.

Update: 2025-09-20 05:36 GMT

IND vs OMAN : టీమిండియాకే చుక్కలు చూపించిన ఒమన్ ఆటగాడు..హాఫ్ సెంచరీతో సరికొత్త చరిత్ర సృష్టించాడు

IND vs OMAN : ఆసియా కప్ 2025లో ఇండియా, ఓమన్ మధ్య జరిగిన చారిత్రక మ్యాచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌ను 21 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ, ఓమన్ జట్టులోని ఒక సీనియర్ ఆటగాడు అమీర్ కలీం చేసిన ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరిచింది. తన అద్భుతమైన హాఫ్ సెంచరీతో అతను ఏకంగా మూడు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు.

టీమ్ ఇండియాపై హాఫ్ సెంచరీతో చరిత్ర

43 ఏళ్ల వయసులో అమీర్ కలీం టీమ్ ఇండియాపై 46 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో అతను టీమ్ ఇండియాపై ఏ ఫార్మాట్‌లో అయినా హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత ఎక్కువ వయసున్న బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను 79 ఏళ్ల క్రితం 1946లో ఈ రికార్డును నెలకొల్పిన ఇంగ్లాండ్ ఆటగాడు వాలీ హ్యామండ్ (43 ఏళ్లు, 31 రోజులు) ను అధిగమించాడు. అమీర్ కలీం వయసు 43 సంవత్సరాల 303 రోజులు.

క్రిస్ గేల్ రికార్డు బద్దలు

అంతేకాకుండా పూర్తి స్థాయి సభ్యత్వం ఉన్న జట్టుపై టీ20 క్రికెట్‌లో హాఫ్ సెంచరీ సాధించిన అత్యంత వయసున్న ఆటగాడిగా కూడా అమీర్ కలీం నిలిచాడు. ఈ రికార్డు గతంలో క్రిస్ గేల్ (41 ఏళ్లు, 294 రోజులు) పేరిట ఉండేది. గేల్ 2021లో ఆస్ట్రేలియాపై ఈ రికార్డును సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును అమీర్ కలీం తన పేరు మీద రాసుకున్నాడు.

ఆసియా కప్‌లో కొత్త రికార్డు

అమీర్ కలీం ఇదే మ్యాచ్‌లో మరో రికార్డు కూడా నెలకొల్పాడు. ఆసియా కప్‌లో అత్యంత వయసున్న బ్యాట్స్‌మెన్‌గా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డు గతంలో అఫ్ఘానిస్థాన్ కెప్టెన్ మహ్మద్ నబీ పేరిట ఉండేది. అంతేకాకుండా, టీమ్ ఇండియాపై టీ20లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత వయసున్న ఆటగాడిగా జాక్స్ కల్లిస్ (36 ఏళ్లు, 166 రోజులు) రికార్డును కూడా కలీం బద్దలు కొట్టాడు. ఈ విధంగా ఒకే మ్యాచ్‌లో మూడు చారిత్రక రికార్డులను సృష్టించి అమీర్ కలీం అందరి దృష్టిని ఆకర్షించాడు.

Tags:    

Similar News