Vaibhav Suryavanshi : 15 సిక్సర్లతో పరుగుల వరద.. యూత్ టెస్ట్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదు!

Vaibhav Suryavanshi : క్రికెట్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ మరోసారి తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 34ఏళ్ల నాటి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు.

Update: 2025-07-16 04:17 GMT

Vaibhav Suryavanshi : 15 సిక్సర్లతో పరుగుల వరద.. యూత్ టెస్ట్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదు!

Vaibhav Suryavanshi : క్రికెట్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ మరోసారి తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 34ఏళ్ల నాటి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ వయసు కేవలం 14 ఏళ్లు మాత్రమే, ఈ గొప్ప రికార్డు 2011లో అతను పుట్టకముందే అంటే 20 ఏళ్ల క్రితం నమోదైంది. 1991లో నమోదైన ఆ రికార్డు ఇప్పుడు బద్దలైంది. ఆ ప్రపంచ రికార్డు ఒక యూత్ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధికంగా నమోదైన మొత్తం పరుగులకు సంబంధించిన రికార్డు ఇది.

భారత అండర్ 19 జట్టు ప్రస్తుతం మెన్స్ సీనియర్, మహిళల జట్ల మాదిరిగానే ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. వైభవ్ సూర్యవంశీ ఆ జట్టులో కీలక సభ్యుడు. ఇంగ్లాండ్ అండర్ 19 జట్టుపై తమ పర్యటనను భారత జట్టు వన్డే సిరీస్‌తో ప్రారంభించింది. ఐదు వన్డేల సిరీస్‌ను భారత అండర్ 19 జట్టు 3-2 తేడాతో గెలుచుకుంది. ఆ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ 143 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్‌తో అత్యధిక పరుగులు సాధించాడు, తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.

భారత్, ఇంగ్లాండ్ అండర్ 19 జట్ల మధ్య ఇప్పుడు 2 టెస్ట్‌ల సిరీస్ జరుగుతోంది. దీనిలో మొదటి మ్యాచ్ జూలై 15న బెక్నమ్‌లో ముగిసింది. బెక్నమ్‌లో జరిగిన మొదటి 4 రోజుల యూత్ టెస్ట్ డ్రాగా ముగిసినప్పటికీ, అందులో నమోదైన పరుగుల సంఖ్య 34 ఏళ్ల నాటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.

భారత్, ఇంగ్లాండ్ అండర్ 19 జట్ల మధ్య బెక్నమ్‌లో జరిగిన మొదటి యూత్ టెస్ట్‌లో రెండు జట్లు కలిపి 15 సిక్సర్లతో మొత్తం 1497 పరుగులు సాధించాయి. ఇది ఒక సరికొత్త ప్రపంచ రికార్డు. ఈ మ్యాచ్‌లో భారత అండర్ 19 జట్టు రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 10 సిక్సర్లతో 748 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టు 5 సిక్సర్లతో 709 పరుగులు చేసింది. భారత్ సాధించిన 748 పరుగులలో వైభవ్ సూర్యవంశీ 70 పరుగులు చేశాడు.. ఇందులో 12 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి.

భారత్, ఇంగ్లాండ్ అండర్ 19 జట్లు ఒక యూత్ టెస్ట్‌లో 1497 పరుగులు చేసి బద్దలు కొట్టిన 34 ఏళ్ల ప్రపంచ రికార్డు 1991లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య చెల్మ్స్‌ఫోర్డ్‌లో జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. అప్పుడు రెండు జట్లు కలిపి 1430 పరుగులు చేశాయి. యూత్ టెస్ట్‌లో అత్యధికంగా నమోదైన టాప్ 5 మొత్తం పరుగుల మ్యాచ్‌లలో ప్రతిదానిలోనూ ఇంగ్లాండ్ అండర్ 19 జట్టు భాగం కావడం విశేషం.

Tags:    

Similar News