Vaibhav Suryavanshi: 14 ఏళ్లకే కోటీశ్వరుడు వైభవ్ సూర్యవంశీ: సంపాదన రహస్యం ఇదే!
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరి నాలుకల మీద నానుతున్న పేరు.
Vaibhav Suryavanshi: 14 ఏళ్లకే కోటీశ్వరుడు వైభవ్ సూర్యవంశీ: సంపాదన రహస్యం ఇదే!
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరి నాలుకల మీద నానుతున్న పేరు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ కేవలం 35 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ తర్వాత కూడా అతని జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం వైభవ్ ఇంగ్లండ్‌లో అండర్-19 యూత్ వన్డే సిరీస్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో పరుగులు వరద పారిస్తున్నాడు. ఇంత చిన్న వయసులోనే వైభవ్ ఎలా కోట్లు సంపాదిస్తున్నాడో తెలుసుకుందాం.
వైభవ్ సూర్యవంశీ పేరు ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ద్వారా మొదటిసారిగా ప్రముఖంగా వినిపించింది. రాజస్థాన్ రాయల్స్ అతన్ని రూ.1.1 కోట్లకు కొనుగోలు చేసింది. బిహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన వైభవ్ నికర విలువ ప్రస్తుతం రూ.1 నుండి రూ.1.5 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. అతని ప్రధాన ఆదాయ వనరు ఐపీఎల్. ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ అతనికి పెద్ద మొత్తంలో చెల్లించింది.
ఇంతేకాకుండా, 18వ సీజన్‌లో అతని అద్భుతమైన ప్రదర్శనను చూసి ఫ్రాంచైజీ వచ్చే సీజన్‌లో కూడా అతన్ని నిలబెట్టుకుంటుందని భావిస్తున్నారు. ఐపీఎల్ తో పాటు, వైభవ్‌కు దేశీయ క్రికెట్ నుండి మ్యాచ్ ఫీజులు, ప్రకటనల ద్వారా కూడా మంచి ఆదాయం వస్తుంది. మొత్తానికి, ఐపీఎల్, దేశీయ క్రికెట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు అతని సంపాదనకు ప్రధాన వనరులు.
వైభవ్ సూర్యవంశీ 2011 మార్చి 27న బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని తాజ్‌పూర్ గ్రామంలో జన్మించాడు. క్రికెట్ పట్ల అతని అభిరుచి నాలుగేళ్ల వయసు నుంచే మొదలైంది. అతని తండ్రి సంజీవ్ స్వయంగా అతనికి క్రికెట్ పాఠాలు నేర్పడం ప్రారంభించారు. తన టాలెంట్ తీర్చిదిద్దారు. ఆ తర్వాత వైభవ్‌ను తన గ్రామానికి చాలా దూరంలో ఉన్న సమస్తిపూర్‌లోని ఒక క్రికెట్ అకాడమీలో చేర్పించారు. అనంతరం పట్నా వెళ్లి క్రికెట్‌ను మరింత సీరియస్‌గా తీసుకున్నాడు. చిన్న వయసులో అతను చేసిన కృషి నేడు ఫలితాలు ఇస్తోంది. వైభవ్ ఇప్పుడు తన గ్రామానికి మాత్రమే కాకుండా, మొత్తం దేశానికి ఒక ఆదర్శంగా మారాడు.
వైభవ్ సూర్యవంశీ వయసు చిన్నదైనా, అతని విజయాలు పెద్దవి. ఐపీఎల్‌లో సంచలనం సృష్టించిన తర్వాత, అతను అంతర్జాతీయ స్థాయిలో కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు. అండర్-19 సిరీస్‌లో అతని ప్రదర్శన రాబోయే కాలంలో అతను భారత క్రికెట్‌కు ఒక పెద్ద స్టార్‌గా మారతాడని నిరూపిస్తోంది. వైభవ్ త్వరలోనే సీనియర్ భారత జట్టులో కూడా చోటు సంపాదిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అతని కృషి, పట్టుదల, ప్రతిభను బట్టి చూస్తే, వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచంలో సుదీర్ఘ ప్రయాణం చేస్తాడని చెప్పడం అతిశయోక్తి కాదు.