నర్సాపురంలో నాగబాబు గెలుస్తారా ?

Update: 2019-05-22 15:08 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు ఇంకా కొన్ని గంటల్లో తెరపడనుంది. కాకపోతే ప్రధాన పోటి మాత్రం వైసీపీ మరియు టిడిపి మధ్యే నడుస్తుందని తేలింది. జనసేన కింగ్ మేకర్ అయ్యేంతా సీన్ లేదని సర్వే ఫలితాలను చూస్తుంటేనే అర్ధం అయిపోతుంది .. కానీ పవన్ గెలుపు జనసేనకి కీలకంగా మారింది .. ఈ ఎనికల్లో భీమవరం మరియు గాజువాక నుండి పోటి చేసారు పవన్..అయితే మొదటగా ఆయన గేలుపు రెండు చోట్లల్లో ఖాయమని అనుకున్నారు కానీ ఇప్పుడు ఎదో ఒక చోటు నుండి మాత్రమే పవన్ గెలుస్తున్నారని తేలుస్తుంది .. ఇక అయనతో పాటు ఈ ఎన్నికల్లో మెగా బ్రదర్ నాగబాబు కూడా పోటిలో ఉన్నారు.. అయన గెలుపు పై కూడా జనసేన భారీ అంచనాలే పెట్టుకుంది ..

ప్రస్తుతం నాగబాబు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటిలో ఉన్నారు. పవన్ పోటి చేస్తున్న భీమవరం నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం కిందికి వస్తుంది. ఇది జనసేనకి కలిసొచ్చే అంశంగా ఉండొచ్చునని జనసేన మొదటగా భావించింది .అంతే కాకుండా అక్కడ కాపు సామాజీకవర్గం కూడా ఎక్కువే .. కాపు ఓటు బ్యాంకును ఉపయోగించుకునేందుకు నాగబాబుని అక్కడి నుండి పోటికి దింపింది జనసేన.. అయితే పవన్ గెలుపుతో పాటు నర్సాపురం ఎంపీగా నాగబాబు విజయం కూడా తథ్యమేనని అనేక కొన్ని సర్వేలు చెబుతున్నాయి..

దాదాపు అన్నిసర్వేలు కూడా జనసేనకి 3-6 ఎమ్మెల్యే సీట్లు రావోచ్చునని అంచనా వేస్తున్నాయి. ఇక ఎంపీ సీట్లల్లో జనసేన ఒక్క సీటు గెలవోచ్చునని చెబుతున్నాయి. అందులో నాగబాబు ఒకరని జనసేన శ్రేణులు ఆశిస్తున్నారు. అలా కాకుంటే విశాఖలో జనసేన ఎంపీ అభ్యర్ధిగా పోటీలోకి దిగిన జేడి లక్ష్మీ నారాయణ గట్టి పోటి ఇచ్చారని అయన గెలుపుకి దగ్గర్లో ఉన్నారని తెలుస్తుంది .. అ ఒక్క ఎంపీ సీటు ఎవరిది అన్నది అటు జనసేనలోను ఇటు ప్రజలలోను ఆసక్తిని రేకెత్తిస్తుంది .. 

Similar News