శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త

శ్రీవాణి ట్రస్టుకు ఇకపై ఆన్ లైన్ ద్వారా విరాళం చెల్లించే సదుపాయం ttdsevaonline.com లేదా GOVINDA TIRUMALA TIRUPATI DEVASTHANAMS ఎండ్రాయిడ్&ఐఓఎస్ యాప్ లో శ్రీవాణి ట్రస్ట్ డోనేషన్స్ ప్రత్యేక పేజీ ని జత చేసిన టీటిడి 10 వేల రూపాయలు విరాళమిస్తే ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం

Update: 2019-11-05 12:08 GMT

                                                                          ( తిరుమల, శ్యామ్.కె.నాయుడు )

శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త వినిపించింది శ్రీవాణి ట్రస్టుకు పదివేల రూపాయలు విరాళమిచ్చి విఐపీ బ్రేక్ దర్శనం పొందే స్కీమ్ ను ఆన్ లైన్ లో ప్రవేశపెట్టింది టీటీడీ. దేశవ్యాప్తంగా ఎస్సీ-ఎస్టీ నివాస ప్రాంతాల్లో మతమార్పిడులు అరికట్టి, హిందూ ఆలయాలను నిర్మించాలని ఉద్దేశంతో అక్టోబర్ నెల 21వ తేదీనా శ్రీవాణి ట్రస్టులో నూతన స్కీమ్ ను టీటీడీ ప్రవేశపెట్టింది. ఇంతకాలం ఆఫ లైన్ లో ఉన్న విధానం ఇప్పుడు ఆన్ లైన్ లోకి అధికారులు తీసుకొచ్చారు, నిన్న సాయంత్రం టీటీడీ వెబ్ సైట్ లో శ్రీవాణి ట్రస్టుకు విరాళం చెల్లించేందుకు వీలుగా ఒక ప్రత్యేక పేజీని టీటీడి అందుబటులోకి తెచ్చింది.

ఈ ఆన్ లైన్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చినపట్టి నుండి 70 మంది భక్తులు ట్రస్టుకు విరాళం చెల్లించి, వారికి అనుకూల తేదీల్లో ప్రోటోకాల్ విఐపీ బ్రేక్ దర్శనాలు పొందారు. దాతలు ఎలాంటి శ్రమలేకుండా ఆన్ లైన్ లో విరాళం చెల్లించి 6 నెలల కాలపరిమితితో వారికి అనుకూలమైన తేదీనా బ్రేక్ దర్శనాన్ని పొందవచ్చని, ఆన్ లైన్-అఫ్ లైన్ కు కలిపి ప్రతిరోజు 500, శుక్రవారం నాడు మాత్రం 200మంది కోటాను నిర్ణయించారు. ఇక ఇటీవల తిరుమలలో పట్టుబడుతున్న దళారీల గురించి ధర్మారెడ్డి స్పందించారు. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్,ఐపీఎస్, రాజ్యంగహోదా ప్రముఖల సిఫార్సు లేఖలను దుర్వినియోగం పరుస్తున్న దళారీల ఆటకట్టేంచి పట్టిష్టమైన విజిలెన్స్ మరియు పోలీసు వ్యవస్థలు తిరుమలలో ఉన్నాయని. అయితే ప్రముఖులు కూడా సిఫార్సు లేఖ సరైనా వ్యక్తులకు కాకుండా దళారీలకు ఇవ్వడం వల్ల వారి వ్యక్తిగత పరువుతో పాటు పవిత్రమైన టీటీడీ ప్రతిష్టను దెబ్బతినడానికి కారకులవుతారని, కావునా ప్రముఖులు సిఫార్సు లేఖలు ఇచ్చే విషయంలో కాస్త జాగ్రత్త పాటించాలని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.


Delete Edit


Tags:    

Similar News