తిరుమలలో వైభవంగా కైశిక ద్వాదశి.. నేత్రపర్వంగా ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగింపు

తిరుమలలో వైభవంగా కైశికద్వాదశి, నేత్రపర్వంగా ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగింపు యేడాదికి ఒకసారి మాత్రమే ఆలయం వెలుపలకు ఉగ్రశ్రీనివాసుడు

Update: 2019-11-09 11:34 GMT

                                                                  ( తిరుమల, శ్యామ్.కె.నాయుడు )

తిరుమల పుణ్యక్షేత్రంలో కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగింపు నేత్రపరంగా జరిగింది. తెల్లవారుజామున శ్రీదేవి భూదేవి సమేతంగా ఉగ్రశ్రీనివాసుడు తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. ఊరేగింపు అనంతరం ఆలయానికి చేరుకున్న ఉగ్రశ్రీనివాసమూర్తి సమక్షంలో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు.

నిత్యోత్సవాలతో విరాజిల్లుతున్న తిరుమల దివ్యక్షేత్రంలో కైశిక ద్వాదశి ఉత్సవానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీవారి ఆలయంలోని పంచబేరాల్లో స్నపనబేరంగా పిలువబడే ఉగ్రశ్రీనివాస ఉత్సవమూర్తి అత్యంత ప్రముఖుడు. గర్భాలయంలోని మూలమూర్తి చెంత ఉండే ఈ ఉత్సవరాయుడు ఏడాదికి ఓ మారు కైశిక ద్వాదశి నాడు మాత్రమే ఆలయం నుండి వెలుపలకు వచ్చి మాడావీధుల్లో ఊరేగుతారు. తెల్లవారుజామున ఉభయ దేవేరులతో కలసి బంగారు తిరుచ్చిపై ఆలయం నుండి బయలుదేరి తిరుమాడ వీధులలో విహరించి సూర్యదయానికి మునుపే తిరిగి ఆలయంలోకి చేరుకుంటాడు. గతంలో ఉగ్రశ్రీనివాసమూర్తిని ఊరేగిస్తున్నప్పుడు పలుమార్లు అగ్ని ప్రమాదాలు సంభవించిన కారణంగా ఈ మూర్తిని కేవలం కైశికద్వాదశి నాడు మాత్రమే ఆలయం లోపల నుండి బయటకి తీసుకొని రావడం అలానే సూర్యోదయానికి ముందే స్వామివారిని తిరుమాఢవీధులలో ఊరేగించి ఆలయంలోనికి తీసుకెళ్తారని ప్రచారం. ఇందులో భాగంగానే నేడు ఉగ్ర శ్రీనివాస మూర్తిని తెల్లవారుజామున ఊరేగించి ఆలయంలో ద్వాదశి ఆస్థానాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు.


Delete Edit


Tags:    

Similar News