మరణం తర్వాత మనం... మరణ సిద్ధాంత మర్మమేంటి?

Update: 2019-08-08 09:10 GMT

మరణం చాలా భయంకరమైనది. అప్పటివరకు మన మధ్యనే ఉన్న వ్యక్తి, ఉన్నట్టుండి కట్టెలా మారిపోతే.. ఆ దృశ్యాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. రాయినుంచి నిప్పు పుట్టించగలిగాం. అదే రాయిని ఆయుధంగా మలిచాం. శబ్దాల నుంచి సంగీతం పుట్టించాం. ఇంకా ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగాం.. కానీ మరణం ఎందుకు వస్తుందో... ఎప్పుడు వస్తుందో కనుక్కోలేకపోయాం. మరణించిన వారిని తలుచుకుని కాసేపు చింతించి.. ఆ తర్వాత మరిచిపోతాం.. కానీ మృత్యు రహస్యాన్ని ఛేదించలేకపోతున్నాం.

మెలుకువతో ఉన్నంతసేపూ మనకు అన్నీ గుర్తుంటాయి. కానీ నిద్రలోకి జారుకోగానే అచేతన స్థితికి వెళ్లిపోతాం. అప్పుడు మన మనసు ఎక్కడ తిరుగుతుందో, ఏమవుతుందో ఎవ్వరికి తెలియదు. ఇంచుమించు మరణం కూడా ఇలానే ఉంటుందటా.. అందువల్ల నిద్ర కూడా ఒక రకంగా మరణమే. శరీరాన్ని విడిచిన శ్వాస, మళ్లీ తిరిగి రాకపోతే అదే మరణం. ఒక్క శ్వాస మాత్రమే ఉండి, అవయవాలు లేకపోతే... మనిషి కూడా గాలిలా రూపం లేకుండా ఉంటాడు. అప్పుడు జీవికి, నిర్జీవికి తేడా ఉండదు. అందుకే జీవి పుట్టుకైనా, మరణమైనా శరీరం తప్పనిసరిగా ఉండాలి. దీన్నుంచి పుట్టిందే జనన మరణ సిద్ధాంతం.

ఈ మరణ సిద్ధాంతం మానవున్ని 25అంగాల్లో, రెండు స్థూల, సూక్ష్మ భాగాలుగా విభజించింది. ఈ 25 భాగాల శరీరాన్ని, ఆత్మ ముందుండి నడిపిస్తుంది. కాల మరణంలో జీవి, స్థూల, సూక్ష్మ భాగాలను వదిలి వెళ్తే... అకాల మరణంలో ఆత్మశరీరాన్ని వదలక, సూక్ష్మశరీరంలోనే ఉంటుందట. జీవి శ్వాస పీల్చడం లేదు కాబట్టి... అందరూ మరణించాడాని భావిస్తారు. కానీ నిజానికి అది పూర్తి మరణం కాదట. అందుకే.. మనవాళ్లు, జీవి అంత్యక్రియల కన్నా ముందు, దింపుడు కళ్లెం జరుపుతారు. జీవి చెవిలో గట్టిగా పిలుస్తారు ఎందుకంటే.. జీవి శరీరంలో ఉన్న శ్వాస బయటికి వచ్చి, జీవి బ్రతుకుతాడేమోనన్న చిన్న ఆశతో అలా చేస్తారు.

Tags:    

Similar News