Religion News: శుభకార్యాలకు మిగిలింది ఇంకా 12 రోజులే.. తర్వాత చేయడానికి వీల్లేదు..!

Religion News: హిందూ సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా ముహూర్తం చూసి చేస్తారు. అప్పుడే ప్రారంభించిన పని విజయవంతం అవుతుందని నమ్మకం.

Update: 2024-04-16 10:56 GMT

Religion News: శుభకార్యాలకు మిగిలింది ఇంకా 12 రోజులే.. తర్వాత చేయడానికి వీల్లేదు..!

Religion News: హిందూ సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా ముహూర్తం చూసి చేస్తారు. అప్పుడే ప్రారంభించిన పని విజయవంతం అవుతుందని నమ్మకం. అయితే ఏప్రిల్‌లో ఇంకా 12 రోజులు మాత్రమే మంచి రోజులు ఉన్నాయి. ఏ శుభకార్యమైన ఏప్రిల్‌ 27 లోపు చేసుకో వాలి. తర్వాత 72 రోజుల వరకు మంచి రోజులు లేవు. శుక్రుడు ఏప్రిల్ 28న బృహస్పతి, సూర్యు డితో కలిసి మేషరాశిలో ఉంటాడు. 73 రోజులు అస్తమించే స్థితిలోనే ఉంటాడు. జూలై 11న మళ్లీ కనిపిస్తాడు. శుక్రుడు అస్తమించిన సందర్భంలో శుభ కార్యాలు చేయకూడదు.

శుక్రుడు కంటి దృష్టికి సంబంధించినవాడు. అంతరిక్షంలో అస్తమించినప్పుడు కంటి శస్త్రచికి త్స చేయించుకోవాలనుకునేవారు దూరంగా ఉండాలి. అస్తమిస్తున్న గ్రహాన్ని సూచించే రత్నాన్ని ధరించకూడదు. శుక్రాష్ట సమయంలో వజ్రాన్ని కొనకూడదు, ధరించకూడదు. సంతానం పొందడంలో సమస్యలను ఎదుర్కొంటున్న, IVF ద్వారా ప్రయత్నిస్తున్న జంటలు ఈ శుక్రస్తా కాలంలో స్తబ్ధుగా ఉండడం ఉత్తమం. కొత్త భవనం కోసం బోర్‌ వేయవలసి వస్తే ఇప్పుడు చేయవద్దు.

కొత్త వాహనం లేదా ఇతర విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడం మంచిది కాదు. శుక్రుడు భార్య సంతోషానికి సంబంధించినవాడు ఈ సమయంలో ఆమె బలహీనంగా ఉంటుంది కాబట్టి గొడవలు జరుగుతాయి. ఆనందం తగ్గిపోతుంది. కాబట్టి వివాహ సంబంధిత పనులు చేయడం మంచిది కాదు. గృహ ప్రవేశం మొదలైనవి చేయవద్దు. ఉపవాసం ఆచరించి, రోజులు గడిచే వరకు వేచి ఉండాలి.

Tags:    

Similar News