Sri Ramanavami 2024: శ్రీరామనవమి రోజు ఈ పనులు చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి.. అవేంటంటే..?

Sri Ramanavami 2024: హిందువుల ముఖ్య పండుగలలో శ్రీరామనవమి ఒకటి. చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీ రాముడు జన్మించాడు.

Update: 2024-04-17 05:16 GMT

Sri Ramanavami 2024: శ్రీరామనవమి రోజు ఈ పనులు చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి.. అవేంటంటే..?

Sri Ramanavami 2024: హిందువుల ముఖ్య పండుగలలో శ్రీరామనవమి ఒకటి. చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీ రాముడు జన్మించాడు. అరణ్యవాసం తర్వాత ఆయప పట్టాభిషేకం, సీతారాముల కల్యాణం కూడా ఇదే రోజు జరిగింది. అందుకే ఈ రోజును అత్యంత పవిత్రదినంగా చెబుతారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 17, బుధవారం శ్రీరామనవమి వస్తోంది. ఈ రోజున దేశంలోని రామాలయాల్లో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. అయితే ఈ రోజు కొన్ని పరిహారాలు చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

శ్రీరామనవమి రోజున ఎరుపు రంగు దుస్తులను ధరించడం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. చక్కెరతో చేసిన11 బతషాలు, కరివేపాకులు,11 లవంగాలను శ్రీరాముడికి సమర్పించాలి. దీనివల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలిగిపోయి ఆనందంగా ఉంటారు. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని 108 సార్లు శ్రీరామ రక్ష మంత్రాన్ని జపించి ఆ నీటిని ఇల్లు మొత్తం చల్లడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

అదే విధంగా రామాలయంలో నెయ్యి లేదా నూనె దీపం వెలిగించి జై శ్రీరామ్ అనే పదాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే భార్య భర్తల మధ్య నిత్యం గొడవలు ఉన్నట్లైతే అలాంటి వారు సీతారాములకు పసుపు, కుంకుమ, గంధం సమర్పించి జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల సమస్యలన్నీ తొలగిపోయి మంచి రోజులు ప్రారంభమవుతాయి. శ్రీ రామ జయ రామ జయ జయ రామ.. అంటూ శ్రీరామ జపం చేయాలి. శ్రీ రామ నవమి రోజున శ్రీ రాముడిని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది.

Tags:    

Similar News