Sri Ramanavami 2024: శ్రీరామనవమి రోజు కచ్చితంగా పానకం తాగాలి.. వడపప్పు తినాలి ఎందుకంటే..?

Sri Ramanavami 2024: హిందువుల ముఖ్య పండుగలలో శ్రీరామనవమి ఒకటి. చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీ రాముడు జన్మించాడు.

Update: 2024-04-17 03:17 GMT

Sri Ramanavami 2024: శ్రీరామనవమి రోజు కచ్చితంగా పానకం తాగాలి.. వడపప్పు తినాలి ఎందుకంటే..?

Sri Ramanavami 2024: హిందువుల ముఖ్య పండుగలలో శ్రీరామనవమి ఒకటి. చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున శ్రీ రాముడు జన్మించాడు. అరణ్యవాసం తర్వాత ఆయప పట్టాభిషేకం, సీతారాముల కల్యాణం కూడా ఇదే రోజు జరిగింది. అందుకే ఈ రోజును అత్యంత పవిత్రదినంగా చెబుతారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 17, బుధవారం శ్రీరామనవమి వస్తోంది. ఈ రోజున దేశంలోని రామాలయాల్లో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు ఆలయాల్లో ప్రసాదంగా బెల్లం పానకం, వడపప్పుని ఇస్తారు. వీటి ప్రాముఖ్యత ఏంటో ఈ రోజు తెలుసుకుందాం.

హిందూ దేవుళ్లలో ఒక్కో దేవుడికి ఒక్కో ప్రత్యేక నైవేద్యం, ప్రసాదం ఉంటుంది. ఆ దేవుడి రోజున ఆ ప్రసాదం మాత్రమే పెడుతారు. దానికి సంప్రదాయంతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉంటాయి. ఉగాది పండుగ తర్వాత వచ్చే శ్రీరామనవమిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజున స్వామి వారికి పానకం,వడపప్పు, బెల్లం నైవేద్యంగా పెడతారు. పానకం తయారు చేసేందుకు బెల్లం, మిరియాలు ఉపయోగిస్తారు. పానకంలో వేసే సుగంధ ద్రవ్యాల వల్ల కొన్ని రకాల వ్యాధులు తగ్గిపోతాయి.

శ్రీరాముడికి స్వయంవరానికి వచ్చిన సమయంలో బెల్లం పానకం ఇచ్చారని ప్రతీతి. పూర్వ కాలంలో వేసవిలో బాటసారులకు వడదెబ్బ తగలకుండా బెల్లం పానకాన్ని ఇచ్చేవారట. ఈ క్రమంలోనే స్వయంవరానికి వెళ్లిన శ్రీరామచంద్రుడికి బెల్లం పానకాన్ని ఇచ్చారని చెబుతారు. ఎండాకాలంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి బెల్లం పానకం మంచి ఔషధంగా పనిచేస్తుంది. అందుకే బెల్లం పానకాన్ని స్వామివారి కల్యాణానికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా ఇస్తారు. ఇందులో మిరియాలు కలపడం వల్ల కఫాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడు తుంది. బెల్లం శరీరంలో ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది. ఇక వడపప్పు మలబద్ధకాన్ని తొలగిస్తుంది.

Tags:    

Similar News