Religion News: గుడికి వెళితే మనసు ప్రశాంతంగా ఉంటుంది.. కారణమేంటో తెలుసా..?

Religion News: ఎవరికి చెప్పుకోలేని బాధ వచ్చినా, మనసుకు కష్టంగా అనిపించిన ప్రతిసారి గుర్తుకువచ్చేది ఆ దేవుడు ఒక్కడే.

Update: 2024-04-21 01:30 GMT

Religion News: గుడికి వెళితే మనసు ప్రశాంతంగా ఉంటుంది.. కారణమేంటో తెలుసా..?

Religion News: ఎవరికి చెప్పుకోలేని బాధ వచ్చినా, మనసుకు కష్టంగా అనిపించిన ప్రతిసారి గుర్తుకువచ్చేది ఆ దేవుడు ఒక్కడే. ఆయన దర్శనం కోసం అందరూ గుడికి వెళుతుంటారు. అక్కడ వారి మనసుకు సాంత్వాన, ఓదార్పు దొరుకుతుంది. దీంతో వారు రిలాక్స్‌ అవుతారు. భవిష్యత్‌ కార్యాచరణవైపు అడుగులు వేస్తారు. ఇవన్నీ కేవలం గుడికి వెళ్లినప్పుడు మాత్రమే జరుగుతాయి. కారణం ఏంటంటే అక్కడ పాజిటివ్‌ ఎనర్జీ ప్రసరించడమే. అంతర్గతంగా నీలో దాగి ఉన్న శక్తిని నువ్వు తెలుసుకోవడానికి ఆలయ పరిసరాలు సాయపడుతాయి.

ప్రతి ఒక్కరూ జీవన విధానంలో ఎన్ని పనులున్నప్పటికీ ఒక రోజు వీలుచూసుకొని గుడికి వెళుతుంటారు. దీనివల్ల తగినంత ఓర్పు, మానసిక ప్రశాంత లభిస్తుందని విశ్వాసం. మనిషికి, దేవుడికి మధ్య వారధి గుడి. గుడికి వెళ్లగానే తెలియకుండా మనసు ప్రశాంతంగా మారిపోతుంది. భూమిలో ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తుంటాయో అక్కడే ఆలయాలన్నీ ఉంటాయి. ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాస య్యేచోట ప్రసిద్ధ దేవాలయాలన్నీ ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే శరీరం, మనసు ప్రశాంతతను పొందుతాయి.

దేవాలయ గర్భ గుడిలో మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన పంచలోహా యంత్రాన్ని నిక్షిప్తం చేసి ఉందుతారు. పంచలోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆ విధంగా లోహం గ్రహించిన ఆకర్షణను పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుం ది. రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారి కి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. దీనివల్ల శరీరంలోనికి పాజిటివ్ తరంగాలు ప్రవేశించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్లే వారిలో ఆలయ యంత్ర ప్రభావిత శక్తి అంతగా కనిపించకపోయినా రోజూ గుడి వెళ్లే వారిలో పాజిటివ్ ఎనర్జీ స్పష్టంగా తెలుస్తుంది.

Tags:    

Similar News