Hanuman Jayanti 2024: హనుమాన్‌ జయంతి రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు..!

Hanuman Jayanti 2024: ఈ ఏడాది ఏప్రిల్‌ 23న హనుమాన్‌ జయంతి వస్తుంది. ఈ రోజు హనుమాన్‌ భక్తులకు పెద్ద పండుగ రోజు. ఈ రోజు శ్రీరాముని గొప్ప భక్తుడైన హనుమంతుడి పుట్టిన రోజు.

Update: 2024-04-22 12:30 GMT

Hanuman Jayanti 2024: హనుమాన్‌ జయంతి రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు..!

Hanuman Jayanti 2024: ఈ ఏడాది ఏప్రిల్‌ 23న హనుమాన్‌ జయంతి వస్తుంది. ఈ రోజు హనుమాన్‌ భక్తులకు పెద్ద పండుగ రోజు. ఈ రోజు శ్రీరాముని గొప్ప భక్తుడైన హనుమంతుడి పుట్టిన రోజు. ప్రతి సంవత్సరం చైత్ర పూర్ణిమ నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. వాస్తవానికి మంగళవారం, శనివారాలు హనుమంతుడికి అంకితం చేశారు. కాబట్టి హనుమాన్ జయంతి మంగళవారం, శనివారం వచ్చినప్పుడల్లా దాని ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. అయితే హనుమాన్‌ జయంతి రోజు ఏం చేయాలి ఏం చేయకూడదో ఈ రోజు తెలుసుకుందాం.

హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుడికి పూజించడానికి 2 పవిత్ర సమయాలు ఉన్నాయి. రోజులో మొదటి శుభ ముహూర్తం ఏప్రిల్ 23 ఉదయం 09:03 నుంచి మధ్యాహ్నం 01:58 వరకు, రెండో శుభ సమయం రాత్రి 08:14 నుంచి 09:35 వరకు ఉంది. హనుమాన్ జయంతి రోజు ఉదయాన్నే స్నానమాచరించి ఉపవాసం ఉండి పూజ చేయాలి. ఈ రోజున నారింజ లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఈశాన్య దిశలో ఎర్రని వస్త్రాన్ని పరచి.. దానిపై హనుమంతుడు, శ్రీరాముని చిత్రాలను ఉంచాలి. ఆంజనేయుడికి ఎరుపు పువ్వులు, రాముడికి పసుపు పువ్వులు సమర్పించాలి. తర్వాత మల్లెపూల నూనె దీపం వెలిగించాలి.

ఆ తర్వాత నైవేద్యం గా అప్పాలు సమర్పించాలి. తర్వాత హనుమంతుడు మంత్రం జపించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. చివరగా హనుమాన్ కి హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం పంచాలి. హనుమాన్‌ కొలిచే ఈ పవిత్రమైన రోజున పొరపాటున కూడా మాంసం తినవద్దు మద్యం తాగవద్దు. అలాగే వంటలలో అల్లం వెల్లుల్లి ఉపయోగించవద్దు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఆహారంలో కలిపి తీసుకోకూడదు. హనుమాన్‌ జయంతి రోజున జుట్టు కత్తిరించు కోవడం మంచిది కాదు. ఇతరులను దూషించకూడదు, అబద్ధాలు ఆడకూడదు.

Tags:    

Similar News