Ugadi Pachdi: ఉగాది పచ్చడి తాగుతున్నారా.. దీని గురించి ఈ విషయాలు తెలుసా..!

Ugadi Pachdi: ఉగాది అంటే తెలుగు వారి పండుగ. తెలుగు కొత్త సంవత్సరం ఈ రోజు నంచే ప్రారంభమవుతుంది.

Update: 2024-04-09 04:00 GMT

Ugadi Pachdi: ఉగాది పచ్చడి తాగుతున్నారా.. దీని గురించి ఈ విషయాలు తెలుసా..!

Ugadi Pachdi: ఉగాది అంటే తెలుగు వారి పండుగ. తెలుగు కొత్త సంవత్సరం ఈ రోజు నంచే ప్రారంభమవుతుంది. తెలుగు దనం ఉట్టిపడే పండగ. వసంత ఋతువు మొదలయ్యే రోజు కూడా ఈ రోజే. అందుకే కొత్త జీవితం నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఈ రోజున ఉదయమే నిద్రలేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజ చేయాలి. అనంతరం ఉగాది పచ్చడి తయారుచేసి తాగి రోజును ప్రారంభిస్తున్నారు. దసరా, సంక్రాంతి, దీపావళి పండుగలకు అన్ని రకాల స్పెషాల్టీలు ఉంటాయి కానీ ఉగాదికి మాత్రం ష‌డ్రుచుల స‌మ్మేళ‌నంతో తయారు చేసే ఉగాది పచ్చడే స్పెషల్​. దీని ప్రాధాన్యం, హిస్టరీ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఉగాది పచ్చడి తెలుగువారికి మాత్రమే సొంతం. జీవితంలో వచ్చే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్న సందేశం అందరికీ అందించడమే ఈ ఉగాది పచ్చడి ప్రత్యేకత. ఈ పచ్చడి తయారీలో వాడే ఒక్కో పదార్థం మనిషి జీవితంలో ఒక్కో అనుభవానికి ప్రతీక అని శాస్త్రం చెబుతోంది. ఈ పచ్చడి మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కటు(కారం), కషాయ(వగరు), లవణం(ఉప్పు), తిక్త(చేదు) రుచులు మిళితమై ఉంటాయి. ఈ ఆరు రుచులు ఆనందం, విచారం, కోపం, భయం, ఓర్పు, ఆశ్చర్యం అనే మానవ భావోద్వేగాలను సూచిస్తాయి. అయితే ఈ పచ్చడి ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలను అందిస్తుంది.

ఆరు రుచులు ఆరు రకాల ఆరోగ్య ప్రయోజనాలు

1. వేప పువ్వు మేలు పలు విధాలుగా ఉంటుంది. వేపపువ్వు చలవ చేస్తుంది.

2. కొత్త బెల్లం ఆకలిని పెంచుతుంది

3. చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది.

4. మిరియపు పొడి శరీరంలో క్రిముల్ని నాశనం చేస్తుంది.

5. మామిడి శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది

6. ఉప్పు మన జీర్ణశక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది.

పచ్చడి తినేటప్పుడు ఈ శ్లోకం తప్పక పఠించండి..

శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ

సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్

Tags:    

Similar News