శ్రీవారికి దీపావళి ప్రత్యేక ఆస్థానాన్ని నిర్వహించిన టీటీడీ

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో దీపావళి పండుగను పురస్కరించుకొని శ్రీవారి ఆలయం దీపావళి ఆస్థానాని టీటీడీ వైభవంగా నిర్వహించింది.

Update: 2019-10-27 06:26 GMT

                                                                    (తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో దీపావళి పండుగను పురస్కరించుకొని శ్రీవారి ఆలయం దీపావళి ఆస్థానాని టీటీడీ వైభవంగా నిర్వహించింది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులను సర్వభూపాల వాహనంలో ఘంటా మండపంలో గరుడాళ్వార్ కి ఎదురుగా సర్వాలంకారాలతో వేంచేపు చేసారు అర్చకులు, స్వామివారికి ఎడమవైపు సర్వసైన్యాధిపతి విష్వక్సేనులు వారు మరోపీఠంపై వేంచేసారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజా నివేదనలు, హరతులు, అరగింపులు సమర్పించడంతో దీవావళి ఆస్థానం ముగిసింది. ఆస్థానం సందర్భంగా ఉత్సవమూర్తులకు జరగాల్సిన అన్ని అర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆస్థానం అనంతరం సామన్యభక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. దీపావళి పండుగ సందర్భంగా భక్తకోటి జీవితాల్లో సుఖసంతోషాలనే వెలుగులు నిండాలని స్వామివారిని ప్రార్థించినట్లు టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.


Delete Edit


Tags:    

Similar News