భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస..

తెలంగాణ రాష్ట్రంలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి ధర్మపురి.. దక్షణ భారతదేశంలో ఉన్న నవ నరసింహ క్షేత్రాలలో ఇది ఒకటి.

Update: 2020-02-01 13:23 GMT

తెలంగాణ రాష్ట్రంలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి ధర్మపురి.. దక్షణ భారతదేశంలో ఉన్న నవ నరసింహ క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 27 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరాన ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ నరసింహ స్వామి లక్ష్మి సమేతంగా యోగసినుడై యోగానంద నరసింహునిగా కొలువై భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించడం ప్రత్యేకతగా చెప్పుకుంటారు. ఈ దేవాలయం వెనుక ఉన్న చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు ఇక్కడి ప్రాంతాన్ని పాలించడం వలన దీనికి ధర్మపురి అనే పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ పుణ్యక్షేత్రంలో ప్రధాన దైవమైన నరసింహుడిని క్షేత్రపాలకుడైన ఆజనేయుడు అష్టదిగ్భందన చేసి ఉంటాడు. అందువల్లే ఈ క్షేత్రం భూత, ప్రేత, పిశాచాల నుంచి బాధింపబడే వారికి ఉపశమనం కలిగిస్తుందని భక్తుల విశ్వాసం.. "భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస... ద్రుష్టసంహార నరసింహ దురితదూర" అని స్మరిస్తూ భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటారు.

మరిన్ని ప్రత్యేకతలు :

♦ ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది, సాక్ష్యాత్తు వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది.

♦ ఇదే ఆలయంలో ఉన్న ఉగ్రనరసింహ స్వామిని కూడా భక్తులు దర్శించుకుంటారు.

♦ ఈ ఆలయానికి అతి సమీపంలో రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడు కాబట్టి దీనికి రామలింగేశ్వర లింగం అని పేరు వచ్చిందని పురాణాలూ చెబుతున్నాయి. రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న వారికీ పునర్జన్మ ఉండదని చెబుతారు.

♦ ఇక్కడ వందల ఏళ్లనాటి ఇసుక స్తంభం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

♦ ఇక్కడి భక్తులు యమధర్మరాజును కూడా దర్శించుకుంటారు. అందువల్లే ధర్మపురికి వచ్చిన వారికి యమపురి ఉండదనే నానుడి ఉంది.

♦ ధర్మపురి క్షేత్రం హైదరాబాద్‌ నగరానికి సుమారు 230 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రమైన కరీంనగ ర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, కరీంనగర్‌ నుంచి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.  

Tags:    

Similar News