మన ప్రవర్తనే మన కష్టసుఖాలకు కారణం... ఎలానో చూడండి!!

Update: 2019-08-10 06:47 GMT

జీవితంలో ఒక్కోసారి మనకు పెద్ద పెద్ద కష్టాలుగా భావించే సమస్యలు వస్తుంటాయి. ఒక్కోసారి అలాంటి సమస్యలు పరువుకు సంబంధించినవి కావడం వల్లనో, లేదా మొహమాటం వల్లనో, లేదా మరో కారణం వల్లనో రహస్యంగా బాధను అనుభవిస్తూ ఉంటాం. ఇక్కడ గమనించవలసిన విషయాలు కొన్ని ఉంటాయి. మనకు ఎదురయ్యే సమస్యలు కొన్ని ముళ్ళ లాంటివి. గుప్పిటిలో బందించినా కొద్ది బాధ మరింత పెరుగుతుంది. అప్పుడు గుప్పిట తెరవాలి లేదా ఆ ముళ్లను విసిరివేయాలి. మరికొన్ని సమస్యలు నిప్పులాంటివి. గుప్పిటిలో బందించినా బాధే , తెరిచినా బాధే. అలాంటి సమస్యలను వెంటనే మనసుల నుండి విసిరివేయాలి.

మరికొన్ని సమస్యలు దుర్గంధ పూరితమైన మలినం లాంటివి. వాటివల్ల తాత్కాలికంగా పెద్దనష్టం లేకున్నా సహించలేని, భరించలేని స్థితి ఏర్పడుతుంది. మనకే కాక మన చుట్టుప్రక్కల వారికి కూడా ఆ ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ధ్యానం, శాంతిప్రక్రియలు, పరిస్థితిని అంగీకరించి అవగాహన చేసుకోవడం, నిరంతరం ఉపయోగపడే పనులతో బిజీగా ఉండడం, మంచి పుస్తక పఠనం ...మొదలైన పద్ధతులతో సమస్యలను కడిగిపారేయాలి.

ఇక మన జీవితంలోని ఆనందాలు సుగందభరితమయిన పుష్పాలలాంటివి. బంధిస్తే మనమే ఆ సుఖాన్ని కొద్దిగా ఆస్వాదిస్తాము. కానీ తెరిస్తే అందరం కలసి ఆ సుఖాన్ని అధికంగా ఆస్వాదిస్తాం. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో మనమే నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టే మన జీవితం లోని కష్ట సుఖాల సాంద్రత ఉంటుంది.

Tags:    

Similar News