Rib Removal For Slim Waist: అందంగా కనిపించాలని బాడీ మొత్తం సర్జరీలు.. ఆఖరుకు పక్క టెముకలు కూడా

Rib Removal For Slim Waist: అందం కోసం కొంతమంది సెలబ్రెటీలు ఎంతకైనా తెగించడం ఈమధ్య పరిపాటుగా మారిపోయింది.

Update: 2025-07-17 05:52 GMT

Rib Removal For Slim Waist: అందంగా కనిపించాలని బాడీ మొత్తం సర్జరీలు.. ఆఖరుకు పక్క టెముకలు కూడా

Rib Removal For Slim Waist: అందం కోసం కొంతమంది సెలబ్రెటీలు ఎంతకైనా తెగించడం ఈమధ్య పరిపాటుగా మారిపోయింది. ప్లాస్టిక్ సర్జరీలు ప్రమాదకరం అని తెలిసినా.. పదే పదే చేయించుకుంటున్నారు. లిప్స్, చెస్ట్, హిప్..ఇలా సన్నగా..నాజూగ్గా.. సెక్సీగా కనిపించేందుకు తమ బాడీ షేప్‌ని మార్చేసుకుంటున్నారు. ఇప్పటికే 5 సర్జరీలు చేయించుకున్న చైనా సెక్సీ బామ్ రాపర్ మిలా బేబీ ఇప్పుడు తన పక్కటెముకలు తీయించుకోడానికి సిద్దమైంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చైనాలో రాపర్ మిలా బేబీ ఫేమస్. తన ఎక్స్ పోజింగ్‌తో కుర్రకారుని తమవైపుకి తిప్పుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటో పెట్టి కుర్రకారు లుక్స్‌ని అట్రాక్ట్ చేస్తుంటుంది. అయితే ఇప్పటికే 5 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న ఈ భామ ఇప్పుడు ఆరవ సర్జరీ చేయించుకోబోతుంది. అయితే ఈ సర్జరీ చాలా ప్రమాదకరం అని డాక్టర్లు చెబుతున్నా ఆమె వినకుండా చేయించుకుంటుంది. ఇంతకీ ఆ సర్జరీ ఏంటంటే..

తన అందం తరగకుండా ఉండాలంటే ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉండాలని మిలా చెబుతుంది. ఇప్పటికే ఈ భామ రెండు బ్రెజిలియన్ బమ్ లిఫ్ట్‌లు, బట్ ఇంప్లాంట్లు, రెండు బ్రెస్ట్‌ ఎన్‌లార్జ్‌ మెంట్ సర్జరీలు, లిప్ ఫిల్టర్లు వంటి పలు కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంది. ప్రస్తుతం మరొక సర్జరీకి రెడీ అయింది. అయితే ఈ సారి ఏకంగా ఎముకలనే తన శరీరం నుంచి తీసివేయించుకుంటుంది.

శరీరంలో మనకు నడుము కింద భాగాన్న పక్కన ఎముకలు ఉంటాయి. వీటినే పక్కటెముకలు అని పిలుస్తాం. అయితే ఇప్పుడు ఈ సర్జరీ ద్వారా మిలా ఆ ఎముకలను తీయించుకోబోతుంది. ఈ సర్జరీకోసం మిల రష్యా వెళుతుంది. అయితే వైద్యనిపుణులు దీనిని ప్రమాదకర దశగా చెబుతున్నారు. అమెరికన్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ టిమ్ నియావిన్ ప్రకారం ఈ ప్రక్రియ ఊపిరితిత్తులను కప్పి ఉంచే కణజాలాన్ని దెబ్బ తీస్తుందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పేషెంట్ హాస్పిటల్‌ పాలయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అయితే, దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మిలా ఈ ఆపరేషన్‌కు సిద్దమవుతుంది.

మిలా శరీరం చాలా లావుగా ఉంటుంది. అయితే తన బాడీ షేప్‌ కోసం ఇప్పటికే పలు సర్జరీలు చేయించుకుంది. అయితే ఇప్పుడు తన బుటక్స్ ప్రాంతం బాగా లావుగా అయిపోవడం వల్ల సర్జరీకి వెళుతుంది. అక్కడ ఉండే పక్కటెముకలను తీసేస్తే సన్నగా అవ్వొచ్చని ఈ భామ ప్లాన్. ఈ ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు చేయించుకోవాలంటే.. తన బాయ్ ఫ్రెండ్స్ తన బాడీని ఎప్పుడు మెచ్చుకుంటూ ఉండాలంటే తప్పదని ఈ భామ చెబుతుంది. ఇప్పటికే నన్ను చూసి మహిళలు జెలస్ ఫీల్ అవుతున్నారు. ఇక ముందు ముందు ఇంకొంత ఫీల్ అవుతారని అంటోంది. కానీ, ఏది ఏమైనా నేచురల్‌గా ఉంటేనే ఏదైనా అందంగా, ఆరోగ్యంగా ఉంటుందని, ఆర్టిఫిషియల్‌గా తయారైతే అది ఆర్టిఫిషియల్ లుక్‌లోనే ఉంటుందన్నది కొంతమంది భావన.

Tags:    

Similar News