Viral Video: ఫొటో కావాలంటే డబ్బులివ్వాల్సిందే.. ఫారిన్‌ టూరిస్ట్ చేసిన పనికి అంతా షాక్‌

Update: 2025-01-21 10:05 GMT

Viral Video of a woman foreign traveller in India: విదేశీయులు పెద్ద ఎత్తున భారత్‌లో పర్యటిస్తారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా మన దేశంలో ఉన్న ప్రముఖ బీచ్‌లకు విదేశీయులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ సమయంలో బీచ్‌ల దగ్గర ఉండే ఇండియన్స్‌ ఫారినర్స్‌తో ఫొటోలు దిగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా లేడీ ఫారినర్స్‌లతో ఫొటోలు అంటే ఎక్కడలేని క్రేజ్‌ ఉంటుంది. ఒక్క ఫారినర్ కనిపిస్తే చాలు చాలా మంది చుట్టు ముట్టేస్తుంటారు.

అయితే ఈ సమస్యకు సింపుల్‌గా చెక్‌ పెట్టిందీ ఓ విదేశీ మహిళ. తనతో సెల్ఫీ దిగాలంటే డబ్బులు చెల్లించాలని ఒక కండిషన్‌ పెట్టింది. ఇందులో భాగంగానే ఒక పేపర్‌పై ఈ విషయాన్ని రాసి చేతిలో పట్టుకుంది. రష్యాకి చెందిన ఓ ఉమెన్ ట్రావెలర్‌ భారతదేశంలో పర్యటనకు వచ్చింది. ఈ సమయంలో ఆమె చేసిన ఓ వింత పని సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. ఏంజలీనా అనే విదేశీ ట్రావెలర్‌ ఇండియాలోని బీచ్‌ను సందర్శించే సమయంలో అక్కడ కొందరు వ్యక్తులు ఆమెతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నం చేశారు.

చాలా మంది సెల్ఫీలు దిగేందుకు గుంపుగూడడంతో ఒక్కో సెల్ఫీకి వంద రూపాయలు అంటూ ఓ పోస్టర్ తీసుకొని నిలబడింది. అయినా కానీ, కొందరు భారతీయులు ఆమెతో సెల్ఫీలు తీసుకోవడానికి తెగ ఉత్సాహం చూపించారు. దీంతో వారి దగ్గర డబ్బులు తీసుకుని మరీ ఆమె సెల్ఫీలకు పోజులిచ్చింది. దీనంతటినీ వీడియోగా తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖతాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు నిజంగానే ఈమె ఆలోచన చాలా బాగుంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంకొందరేమో సెల్ఫీలకు కూడా ఒక రేట్ ఫిక్స్ చేశారంటే ఈవిడ మామూలు లేడీ కాదుర బాబూ అని ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News