Viral Video: రీల్స్ వీడియో చేస్తూ నదిలో పడిన తల్లి... అమ్మ కోసం బిడ్డ ఆర్తనాదాలు

Mother drowned in river while making reels: బిడ్డ చేతికి ఫోన్ ఇచ్చి రీల్ షూట్ చేయాల్సిందిగా చెప్పి తల్లి నది తీరంలో

Update: 2025-04-17 09:08 GMT

రీల్స్ కోసం వీడియో చేస్తూ నదిలో పడిపోయిన తల్లి... అమ్మ కోసం బిడ్డ ఆర్తనాదాలు

Nepal woman drowned in Indian river while making reels: రీల్స్ కోసం, షార్ట్స్ కోసం నదులు, చెరువులు, పెద్దపెద్ద జలపాతాలు, లోయల వద్ద వీడియోలు చేస్తూ జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది జనం తీరు మారడం లేదు. ప్రమాదం అని తెలిసి కూడా రిస్క్ అయిన ప్రాంతాల్లో ఫోటోలు, వీడియోల కోసం ఫోజులిచ్చేందుకు పాకులాడుతున్నారు. ఆ క్రమంలోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనలోనే సమ్మర్ హాలీడేస్ వెకేషన్ కోసమని బంధువుల ఇంటికి వెళ్లిన ఒక మహిళ నదిలో రీల్ షూటింగ్ కోసమని దిగి ప్రాణాలు కోల్పోయారు.

నేపాల్‌కు చెందిన ఒక 35 ఏళ్ల మహిళ తన 11 ఏళ్ల బిడ్డను తీసుకుని సరదాగా ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో ఉన్న తమ బంధువుల ఇంటికి వచ్చారు. అనంతరం అక్కడికి సమీపంలోని భగీరథి నదిని చూసేందుకు వెళ్లారు. మణికర్ణిక ఘాట్ వద్ద పర్యాట ప్రదేశాలు వీక్షించారు. అనంతరం రీల్ షూట్ చేసేందుకు రెడీ అయ్యారు.

బిడ్డ చేతికి ఫోన్ ఇచ్చి రీల్ షూట్ చేయాల్సిందిగా చెప్పి తల్లి నది తీరంలోకి దిగారు. మొదట నవ్వుతూ కెమెరాకు ఫోజిచ్చారు. కానీ అంతలోనే కాలు స్లిప్ అయి నదిలోపలికి పడిపోయారు. కళ్ల ముందే కన్నతల్లి నదిలో పడిపోవడం చూసి బిడ్డ షాక్ అయ్యారు. "మమ్మీ.. మమ్మీ" అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. మరోవైపు ఆ మహిళ ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె నదిలోంచి బయటపడేందుకు ఎలాంటి సపోర్ట్ దొరకలేదు. నదిలో నీళ్ల ప్రవాహంలో మరింత లోపలికి కొట్టుకుపోయారు.రీల్స్ కోసం నదిలోకి దిగిన తల్లి అందులోనే మునిగిపోవడం చూసిన ఆ చిన్నారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఎంత వెతికినప్పటికీ వారికి ఆమె మృతదేహం లభించలేదు.

రీల్స్, షార్ట్స్, సోషల్ మీడియా వీడియోల కంటే ప్రాణాలు, కుటుంబం ముఖ్యం అని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

గతేడాది జులైలో మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్‌లో ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ కూడా లోయ ఒడ్డున నిలబడి రీల్స్ చేస్తూ లోయలో పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఒక్క ఘటనే కాదు... గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.  అందుకే ప్రమాదం పొంచి ఉండే ప్రాంతాల్లో ఫోటోలు, వీడియోలు అంటూ ప్రాణాలపైకి తెచ్చుకోవద్దు. లేదంటే ఏదైనా జరగకూడని ఘటనలు జరిగాక బాధపడటం తప్ప ఇక చేసేదేం ఉండదు. అందుకు ఉత్తరకాశీ ఘటనే మరో బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది.

Tags:    

Similar News