రోడ్ల పక్కన చెట్లకి వైట్‌ పెయింట్‌ గమనించారా.. వాస్తవానికి ఇది ఎందుకో తెలుసా..?

రోడ్ల పక్కన చెట్లకి వైట్‌ పెయింట్‌ గమనించారా.. వాస్తవానికి ఇది ఎందుకో తెలుసా..?

Update: 2022-09-18 13:30 GMT

రోడ్ల పక్కన చెట్లకి వైట్‌ పెయింట్‌ గమనించారా.. వాస్తవానికి ఇది ఎందుకో తెలుసా..?

White Paint Trees: మీరు రోడ్లపై ప్రయాణించేటప్పుడు తరచుగా ఒక విషయాన్ని గమనించే ఉంటారు. పెద్ద పెద్ద చెట్లకి వైట్‌ పెయింట్‌ వేసి ఉంటుంది. హైవే రోడ్డులో మాత్రమే కాదు.. అడవి అయినా దగ్గరలోని పార్కు అయినా అక్కడి చెట్లకి పెయింట్‌ కనిపిస్తుంది. అయితే ఇలా చెట్లకి రంగులని ఎందుకు వేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.. దీని వెనుక బలమైన కారణం ఉంది. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

హైవేలో కానీ అడవిలో కానీ చెట్టు కాండం భాగంలో వైట్‌ పెయింట్ వేస్తారు. వీధి దీపాలు లేని కొన్ని రోడ్లు ఉన్నందున ఇలా చెట్లకి పెయింట్‌ వేస్తారు. దీనివల్ల పలు వాహనాల డ్రైవర్లు చీకట్లో రోడ్డుని బాగా చూడగలుగుతారు. అలాగే దట్టమైన అడవిలో దారి చూపడానికి చెట్లపై రంగులు ఉపయోగపడుతాయి. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు.

ఇది కాకుండా ఇంకో ప్రయోజనం కూడా ఉంది. ఇలా చెట్లకి వైట్‌ పెయింట్‌ వేయడం ఒక సంకేతం. వాస్తవానికి రంగులు వేసిన చెట్లన్నీ ప్రభుత్వ అటవీ శాఖ ఆస్తి. ఎవరైనా వాటికి హాని చేస్తే వారిపై అటవీ శాఖ చర్యలు తీసుకుంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎరుపు, నీలం రంగులను కూడా వేస్తారు. అటవీ శాఖ తన ప్రణాళిక ప్రకారం చెట్లను లెక్కించడానికి ఇలా పెయింటింగ్‌ ప్రక్రియ చేపడుతుంది.

వాస్తవానికి చెట్లకి వైట్‌ పెయింటింగ్‌ కోసం సున్నం ఉపయోగిస్తారు. దీనివల్ల చెట్లకి మంచి జరగుతుంది. చెట్టు బెరడులోని పగుళ్లను రక్షించవచ్చు. చెట్టుకు ఎలాంటి హాని జరగదు. చెట్టు ఆయుష్షు పెరుగుతుంది. సున్నం వల్ల కీటకాలు, చెదపురుగులు పెరగవు. కాండం బలంగా తయారవడానికి ఉపయోగపడుతుంది.



 


Tags:    

Similar News