Watch: కోళ్లపై దాడి చేసి గుడ్లు మింగిన కోడెనాగు.. చివరికి నాగమ్మ పరిస్థితి ఇలా మారింది..!
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం బొడ్డవర పంచాయతీ భవానీనగర్‌లో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక రైతు ప్రకాష్ తన ఇంట్లో కోళ్లు పెంచుతున్నాడు. ప్రతి రోజు లాగే సాయంత్రం కోళ్లను గంప కింద పెట్టి ఇంటికి వెళ్లిపోయాడు.
Watch: కోళ్లపై దాడి చేసి గుడ్లు మింగిన కోడెనాగు.. చివరికి నాగమ్మ పరిస్థితి ఇలా మారింది..!
విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం బొడ్డవర పంచాయతీ భవానీనగర్‌లో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక రైతు ప్రకాష్ తన ఇంట్లో కోళ్లు పెంచుతున్నాడు. ప్రతి రోజు లాగే సాయంత్రం కోళ్లను గంప కింద పెట్టి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే కొద్ది సేపటికి ఒక పెద్ద కోడెనాగు పాము అక్కడికి చేరి రెండు కోళ్లను కాటేసింది. అంతటితో ఆగకుండా, కోళ్లు పెట్టిన మూడు కోడిగుడ్లను కూడా మింగేసింది.
ఉదయం గంప తీసి చూడగా కోళ్లు చనిపోయి కనిపించడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. పరిశీలించగా పాము కాటే కారణమని గుర్తించారు. ఆ నాగుపాము ఇంకా ఇంటి వద్దే తిరుగుతుందని గుర్తించిన ప్రకాష్ వెంటనే గ్రామస్తులకు చెప్పడంతో పాటు గ్రామంలో ఉన్న స్నేక్ క్యాచర్ పెంటకోట సూరిబాబుకు సమాచారం ఇచ్చాడు.
స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకున్న తర్వాత కూడా నాగుపాము ఇల్లంతా చుట్టి తిరుగుతూ అందరిని భయబ్రాంతులకు గురి చేసింది. అయితే కొంతసేపటి పాటు సాహసోపేతంగా ప్రయత్నించి, చివరకు పామును సురక్షితంగా పట్టుకొని సమీపంలోని కొండ ప్రాంతంలోని అడవిలో వదిలిపెట్టాడు. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సంఘటనతో గ్రామంలో కొంత భయం నెలకొన్నా, అటవీ శాఖ అధికారులు మాత్రం గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. తరచూ పాములు కనిపిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని, పాములు కనబడితే వాటిని చంపకుండా వెంటనే స్నేక్ క్యాచర్ లేదా అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పర్యావరణ సమతుల్యత కోసం పాములను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదేనని అధికారులు గుర్తు చేశారు.