Viral Video: పుట్టిన తర్వాత తొలిసారి నీటిలోకి దిగిన పిల్ల ఏనుగు.. చూసినవాళ్లు ఫిదా..!
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ పిల్ల ఏనుగు వీడియో బాగా వైరల్ అవుతోంది. పుట్టిన తర్వాత మొదటిసారి నీటిని తాకిన ఆ చిన్న ఏనుగు తన తొలి స్నానాన్ని ఎంత ఆనందంగా ఆస్వాదించిందో చూసి నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు.

వీడియోలో పిల్ల ఏనుగు నీటిలో నిలబడి ప్రశాంతంగా ఆడుకుంటూ కనిపిస్తుంది. సాధారణంగా చిన్న ఏనుగులు అల్లరి చేస్తుంటాయి. కానీ ఈ చిన్న ఏనుగు మాత్రం తొలిసారి నీటిని తాకగానే సంతోషంగా అందులో మునిగి ఆడుకోవడం అందరినీ ఆకట్టుకుంది.
ఈ అందమైన వీడియోను @MrLaalpotato అనే యూజర్ తన X (Twitter) ఖాతాలో షేర్ చేశారు. “నవజాత ఏనుగు తన మొదటి స్నానాన్ని ఆస్వాదిస్తోంది” అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ క్యూట్ మోమెంట్ చూసిన వారందరూ హృదయపూర్వకంగా స్పందిస్తున్నారు.
ఒకరు, “ఈ ఏనుగు ఐదు నిమిషాల్లో నేర్చుకున్నదాన్ని నేను ఏడాదిలో కూడా నేర్చుకోలేకపోయా” అని కామెంట్ చేశారు. మరొకరు, “దాని మీద మంచు కురుస్తున్నట్టుంది” అని సరదాగా రాశారు. ఇంకొందరు ఇది ప్రకృతిలో పిల్లలకు లభించే ప్రత్యేకమైన ఆనంద క్షణమని పేర్కొన్నారు.
ఈ చిన్న ఏనుగు అమాయకమైన ఆనందాన్ని చూపించే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.