Vitamin D To Deal With Covid19: విటమిన్ డీ పెంచుకోండి, వైరస్ ను ఎదుర్కొనే వ్యవస్థను తయారు చేసుకోవాలి

Vitamin D To Deal With Covid19: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ముందుగా దాన్ని శరీరంలో ఎదుర్కొనే వ్యవస్థను తయారుచేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Update: 2020-07-13 06:00 GMT

Vitamin D To Deal With Covid19: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ముందుగా దాన్ని శరీరంలో ఎదుర్కొనే వ్యవస్థను తయారుచేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైరస్ ఏ విధంగా సోకుతుందో తెలియడం లేదని, అందువల్ల ముందు ఈ విటమిన్లు పెంచుకుని కొంత మెరుగైన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందాక విటమిన్‌ల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఎక్కడ చూసినా వైరస్‌ను తట్టుకోవాలంటే ఎలాంటి విటమిన్‌లు ఉన్న ఆహారం తీసుకోవాలి, ఏఏ మాత్రలు వాడాలి అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత కరోనా సమయంలో ముఖ్యంగాశరీరంలో విటమిన్‌ డి లోపం లేకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్‌–డి ఇమ్యూనిటీ వ్యవస్థను మెరుగు పరుస్తుంది కాబట్టి కరోనా వైరస్‌ సోకినా తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం ఉంటుందని వారు చెబుతున్నారు.

విటమిన్‌ డి ఎందుకు అవసరం అంటే..

► విటమిన్‌ డి ఇమ్యూనిటీ (వ్యాధి నిరోధక శక్తి) వ్యవస్థను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

► ఎముకల సాంద్రతకు ఇతోధికంగా ఉపయోగపడుతుంది.

► నాడీ, మెదడు వ్యవస్థలు పనిచేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

► ఊపిరితిత్తుల పనితీరులోనూ, గుండె జబ్బుల నియంత్రణలోనూ ఎంతగానో ఉపయోగపడుతుంది.

► శరీరంలో కాల్షియం, ఫాస్పరస్‌ నిల్వలను నియంత్రిస్తుంది.

► విటమిన్‌ డి సూర్యరశ్మి ద్వారా వస్తుంది. మాత్రలు తీసుకోవడం ద్వారానూ దీన్ని పెంపొందించుకోవచ్చు.

ప్రస్తుత కరోనా సమయంలో విటమిన్‌ డి లోపం లేకుండా చూసుకోవాలని క్యాన్సర్‌ వైద్య నిపుణులు, డా.బొబ్బా రవికిరణ్ తెలిపారు. విటమిన్‌ డి శరీరాన్ని నీరసపడకుండా చూస్తుందన్నారు. ఇది లోపిస్తే చాలా ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. రక్తపరీక్షల చేయించుకోవడం ద్వారా విటమిన్‌ డి లోపాలు తెలుసుకోవచ్చని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.t    

Tags:    

Similar News