Viral Video: నిద్ర మత్తులో 10వ ఫ్లోర్ నుంచి జారిపడిన వ్యక్తి.. 8వ ఫ్లోర్ కిటికీలో చిక్కుకుని నరకయాతన.. వీడియో వైరల్!
Viral Video: సూరత్ జహంగీరాబాద్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న నితిన్ ఆదిత్య (57) తన గదిలో నిద్రిస్తున్న సమయంలో పొరపాటున కిటికీ వైపు జారిపడి కిందకు పడిపోయాడు.
Viral Video: నిద్ర మత్తులో 10వ ఫ్లోర్ నుంచి జారిపడిన వ్యక్తి.. 8వ ఫ్లోర్ కిటికీలో చిక్కుకుని నరకయాతన.. వీడియో వైరల్!
సూరత్ జహంగీరాబాద్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న నితిన్ ఆదిత్య (57) తన గదిలో నిద్రిస్తున్న సమయంలో పొరపాటున కిటికీ వైపు జారిపడి కిందకు పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తు అతను ఎనిమిదో అంతస్తు కిటికీలో తలకిందులుగా చిక్కుకున్నాడు. దాదాపు గంటపాటు నరకయాతన అనుభవిస్తూ అక్కడే వేలాడుతూ ఉండిపోయాడు.
ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి నితిన్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం అతన్ని అంబులెన్స్‌లో సమీపంలోని గురుకృప ఆస్పత్రికి తరలించారు.
డాక్టర్ల సమాచారం ప్రకారం నితిన్ ఆదిత్యకు ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ‘పునర్జన్మ అంటే ఇదే’ అంటూ స్పందిస్తున్నారు.