Viral Video: మార్స్‌పై రాత్రి ఎలా ఉంటుందో తెలుసా? వైరల్‌ వీడియోపై ఓ లుక్కేయండి

Update: 2025-01-20 15:50 GMT

Viral Video: మార్స్‌పై రాత్రి ఎలా ఉంటుందో తెలుసా? వైరల్‌ వీడియోపై ఓ లుక్కేయండి

How night time appears on mars: ఎన్నో వింతలకు మరెన్నో విశేషాలకు నెలవు మన విశ్వం. ఇంకా మనిషి చేతికి చిక్కని వింతలు, విశేషాలు, ఖగోళ రహస్యాలు ఎన్నో ఈ విశ్వంలో దాగి ఉన్నాయి. ఈ విశ్వాన్ని చేధించే క్రమంలో మనిషి అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అంతరిక్షంలో అద్భుతాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్‌ మీడియా వేదకిగా ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో? అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

అంగారక గ్రహంపై పరిశోధకులు నిత్యం పరిశోధనలు చేపడుతూనే ఉన్నారు. మార్స్‌పై మనిషి ఆవాసానికి సరిపడ పరిస్థితులు ఉంటాయని పరిశోధకులు బలంగా నమ్ముతుంటారు. అందుకే ఈ గ్రహంపై పరిశోధనలు పెద్ద ఎత్తున చేస్తుంటారు. ఈ క్రమంలో మార్స్‌ గ్రహంపై రాత్రి ఎలా ఉంటుందన్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ట్విట్టర్‌లో క్యూరియాసిటీ పేరుతో ఉన్న ఎక్స్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

ఈ వీడియోలో అంగారకుడిపై రాత్రిపూట నక్షత్రాలు మెరుస్తున్నట్లు కనిపిస్తోంది. అంగారకుడిపై వాతావరణం చాలా పలుచగా ఉండడం వల్ల అంతరిక్షం నుంచి వచ్చే వెలుగు నేరుగా ప్రసరిస్తూ ఉంటుంది. దీంతో రాత్రిపూట అంగారకుడిపై కూడా కొంత వెలుతురు కనిపిస్తోంది. ఇక నక్షత్రాలు అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి.

అయితే, ఈ వీడియో నిజంగా సేకరించిందా లేక ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ సహాయంతో రూపొందిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకు కూడా కారణం లేకపోలేదు. గతంలో ఇలా విశ్వంలోని వింతలు అంటూ ఏవేవో కృత్రిమ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలున్నాయి. అందుకే ఈ వీడియో విషయంలోనూ నెటిజెన్స్ అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఏదేమైనా కోట్లాది నక్షత్రాలతో కనువిందు చేస్తున్న ఈ వీడియో మాత్రం ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. మరి ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి.

Tags:    

Similar News