Viral Video: షూస్ ధరించే ముందు జాగ్రత్తపడాల్సిందే.. ఈ వైరల్ వీడియో చూస్తే షాక్ అంతే..!
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇలా వైరల్ అయ్యే వీడియోల్లో పాములకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి.
Viral Video: షూస్ ధరించే ముందు జాగ్రత్తపడాల్సిందే.. ఈ వైరల్ వీడియో చూస్తే షాక్ అంతే..!
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇలా వైరల్ అయ్యే వీడియోల్లో పాములకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. ఒకప్పుడు అడవుల్లో, మనుషులకు దూరంగా ఉండే పాములు ఇటీవల జన సందోహంలోకి వస్తున్నాయి. ప్రజలను భయబ్రాంతులోకి గురి చేస్తున్నాయి. ఆగిన బైకుల్లో, ఇళ్లలోకి చొరబడుతున్నాయి. దీంతో చాలా మంది స్మార్ట్ ఫోన్‌లో పాములకు సంబంధించిన వీడియోలను బంధిస్తున్నారు.
వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ ఇంటి ముందు ఉన్న చెప్పుల స్టాండ్‌లో షూ ఉంది. అంతలోనే అక్కడికి వచ్చిన ఓ ఆరు అడుగుల పాము వేగంగా వచ్చి షూస్‌లోకి దూరిపోయింది. అంత చిన్న షూలోకి పెద్ద పాము దూరడం చూస్తుంటే ఆశ్చర్యమే కాదు, భయపడడం ఖాయం.
దీనంతటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది. షూస్ వేసుకోవాలంటే భయం వేయడం ఖాయమని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు షూస్‌ను ఉపయోగించే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తంమీద ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.