Viral Video: లక్షన్నర విలువైన ఫోన్‌ను దొంగలించిన కోతి.. తర్వాత ఏమైందో తెలుసా?

Viral Video: సోషల్‌ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వీటిలో జంతువులకు సంబంధించి వీడియోలే ఎక్కువగా ఉంటున్నాయి.

Update: 2025-03-19 07:39 GMT

Viral Video: లక్షన్నర విలువైన ఫోన్‌ను దొంగలించిన కోతి.. తర్వాత ఏమైందో తెలుసా?

Viral Video: సోషల్‌ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వీటిలో జంతువులకు సంబంధించి వీడియోలే ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా పాములు, కోతులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ ఫన్నీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో అంతలా ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా దొంగతనం ఎవరు చేస్తారు. మనుషులే కదా అని అంటారా.? అయితే కోతులు దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం అలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియా ట్రెండ్‌ అవుతోంది. ఏదో పర్యాటక ప్రదేశంలో ఓ టూరిస్ట్‌ తన ఫోన్‌తో ఫోటోలు తీస్తున్నాడు. ఆ ఫోన్‌ రూ. 1.5 లక్ష విలువైన సామ్‌సంగ్‌ ఎస్‌25 అల్ట్రా ఫోన్‌. అక్కడే ఉన్న ఓ కోతి టూరిస్ట్‌ చేతిలోని ఫోన్‌ను తీసుకొని పారిపోయింది. దీంతో కోతి వెంట పరిగెత్తడం ప్రారంభించాడు.

ఆ కోతి దగ్గరకి వెళ్లేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఆ కోతి మాత్రం ఒక అవతలి గోడపై కూర్చొని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కోతి దగ్గర ఉన్న ఫోన్‌ను ఎలా తిరిగి పొందాలని ప్లాన్‌ వేశారు. ఇంతలోనే ముగ్గురు వ్యక్తులు కోతిపైకి కొన్ని పండ్లను విసిరారు అయితే అవేవి కోతి దగ్గరికి చేరుకోలేవు. చివరికి ఒకరు మ్యాంగో జ్యూస్ ప్యాకెట్ విసిరితే, దాన్ని అందుకున్న కోతి ఆనందంగా ఫోన్‌ను పడేసింది.

దీంతో ఫోన్‌ను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్‌లో రికార్డ్‌ చేశాడు. వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కోతులు కూడా లంచం ఆశిస్తాయన్నమాట అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో తెగ ట్రెండ్‌ అవుతోంది.


Tags:    

Similar News