Viral Video: కల్లు దించేందుకు చెట్టెక్కిన గౌడన్న.. కుండలో ఏముందో చూడగా షాక్‌..!

Viral Video: చెట్టు కల్లు ఆరోగ్యానికి మంచిదని చాలా మంది చెబుతుంటారు. ముఖ్యంగా ఈత కల్లును తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు కిడ్నీల్లో రాళ్లు కూడా తగ్గుముఖం పడుతాయని చాలా మంది విశ్వసిస్తారు.

Update: 2025-02-22 07:19 GMT

Viral Video: కళ్లు దించేందుకు చెట్టెక్కిన గౌడన్న.. కుండలో ఏముందో చూడగా షాక్‌..!

Man Climbs Palm Tree for Toddy Shocked by What He Finds in the Pot

Viral Video: చెట్టు కల్లు ఆరోగ్యానికి మంచిదని చాలా మంది చెబుతుంటారు. ముఖ్యంగా ఈత కల్లును తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు కిడ్నీల్లో రాళ్లు కూడా తగ్గుముఖం పడుతాయని చాలా మంది విశ్వసిస్తారు. కాగా ఇటీవల యువత కూడా చెట్టు కల్లును తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కల్లుకు సంబంధించి వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ గౌడన్న షేర్‌ చేసిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో అంతలా ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఓ వ్యక్తి కల్లు కుండను దించేందుకు తాటి చెట్టుపైకి ఎక్కారు. తన వెంట స్మార్ట్‌ ఫోన్‌ కూడా ఉంది. అయితే చెట్టుపైకి ఎక్కి వెంటనే గౌడన్నలు మొదటగా చేసే పని కుండలో కళ్లు ఎంత ఊరిందో చూస్తారు. అయితే అలాగే కుండలోకి చూడగానే ఆయనకు ఊహించని ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది.

కల్లు కోసం కట్టిన కుండలో ఓ ఉడుము ప్రత్యక్షమైంది. ఇంకేముంది జేబులో ఉన్న స్మార్ట్‌ ఫోన్‌ను తీసి ఆ ఉడుమును తన ఫోన్‌లో బంధించారు. అక్కడితో ఆగకుండా ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో వీడియో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ కల్లు తాగితే ఏమవుతుంది అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఉడుములు ఇలా చెట్లు ఎక్కడం సాధారణ విషయం అని అంటున్నారు. కల్లు తాగేందుకు పాములు, ఉడుములు ఇలా ఎక్కుతాయని కొందరు అంటున్నారు. గతంలో కూడా ఇలా కుండలో పాములు కనిపించిన సంఘటనలు సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్‌ అయ్యాయి. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఓ సారి ఈ వీడియోపై లుక్కేయండి. 


Tags:    

Similar News