Viral Video: హర్యానా వీధుల్లో కారు భీభత్సం.. నడిపింది ఎవరో తెలిస్తే షాక్..

Viral Video: హర్యానాలోని ఒక వీధులో కారు భీభత్సం సృష్టించింది. వీధుల్లో ఉన్న మనుషులు, వాహనాలు, వస్తువులపై దూసుకుపోయింది. ఎలా కారు వస్తుందో తెలియక జనం వీధుల్లో పరుగులు తీశారు.

Update: 2025-07-21 13:44 GMT

Viral Video: హర్యానా వీధుల్లో కారు భీభత్సం.. నడిపింది ఎవరో తెలిస్తే షాక్..

Viral Video: హర్యానాలోని ఒక వీధులో కారు భీభత్సం సృష్టించింది. వీధుల్లో ఉన్న మనుషులు, వాహనాలు, వస్తువులపై దూసుకుపోయింది. ఎలా కారు వస్తుందో తెలియక జనం వీధుల్లో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాలు చూద్దాం.

హర్యానాలోని వీధుల్లో ఉదయం 8 గంటలకు ఒక కారు రయ్ మని దూసుకుపోయింది. కారు నడుపుతున్న వారు నియంత్రణ కోల్పోవడంతో ఆ కారు దానికి ఇష్టమొచ్చినట్లు రోడ్లపై వెళ్లిపోయింది. వీధుల్లో ఉన్న వాహనాలు, జనాలపైకి ఆ కారు దూసుకుపోయింది. మధ్యలో ఆ కారుకు ఎదురుగా వచ్చిన ముగ్గురు పిల్లలు, ఒక బైకర్.. అదృష్టవ శాత్తూ తప్పించుకున్నారు. కానీ పలు వాహనాలు ధ్వసమయ్యాయి.

అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడయాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని ఘర్ కే కాలేశ్ అనే పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్‌లో ఒకరు పోస్ట్ చేశారు. అయితే ఈ కారుని నడిపినవాళ్లు ఎవరో తెలిస్తే షాక్ తింటారు. ఎందుకంటే ఆ కారును నడిపింది, పక్కన కూర్చుని ఉన్నది ఇద్దరూ.. మైనర్లు. ఈ కారు భీభత్సం సృష్టించిన తర్వాత ఒక చోట ఆగినపుడు ఆ కారులోంచి ఇద్దరు మైనర్లు నెమ్మదిగా బయటకు దిగుతారు. ఆ కారుని అక్కడే వదిలేసి వెనక్కి చూడకండా అక్కడ నుంచి వెళ్లిపోతారు.

అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఆ పిల్లలకు కార్ డ్రైవంగ్ నేర్పించింది ఎవరు? అలాగే పిల్లల తల్లిద్రండులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు.



Tags:    

Similar News