Viral Video : రైల్వే కోచ్ కాదు..అది ఒక నడిచే ప్యాలెస్..లోపల ఏసీలు, ఫ్రిజ్ లు చూసి జనం ఖంగుతింటున్నారు
Viral Video : ట్రైన్ ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కిటికీ పక్కన కూర్చుని అలా బయట ప్రకృతిని చూస్తుంటే ఆ కిక్కు వేరే ఉంటుంది.
Viral Video : ట్రైన్ ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కిటికీ పక్కన కూర్చుని అలా బయట ప్రకృతిని చూస్తుంటే ఆ కిక్కు వేరే ఉంటుంది. అయితే, ఎప్పుడైనా మీరు రైలు డబ్బాని ఒక విలాసవంతమైన ఇల్లుగా ఊహించుకున్నారా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రైలు కోచ్ లోపల ఏకంగా ఒక ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ సౌకర్యాలతో ఉన్న ఇల్లు ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తోంది.
సాధారణంగా రైలు బోగీలు అంటే మనకు గుర్తొచ్చేది బర్తులు, ఫ్యాన్లు, కిక్కిరిసిన జనం. కానీ ఈ వైరల్ వీడియోలో ఉన్న కోచ్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఇది రైల్వే ట్రాక్ మెషిన్ స్టాఫ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్యాంపింగ్ కోచ్. బయట నుంచి చూడటానికి మామూలు రైలు డబ్బాలాగే ఉన్నా.. లోపలికి అడుగుపెడితే మాత్రం ఒక విలాసవంతమైన ఫ్లాట్‌లోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఈ వీడియోలో ఒక వ్యక్తి తన కదిలే ఇల్లు ఎలా ఉంటుందో ప్రపంచానికి పరిచయం చేశాడు.
ముందుగా ఈ కోచ్ లోపల ఉన్న బాత్‌రూమ్ చూస్తే షాక్ అవుతారు. రైలు బాత్‌రూమ్‌లు అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంటుంది, కానీ ఇందులో గీజర్, మోడ్రన్ నల్లాలు, వెస్ట్రన్ టాయిలెట్ సీటుతో చాలా క్లీన్ గా ఉంది. ఇక వంటగది విషయానికి వస్తే.. అక్కడ ఒక చిన్న ఫ్రిజ్, వంటకు కావాల్సిన అన్ని వస్తువులు అమర్చి ఉన్నాయి. రైల్వే సిబ్బంది దూర ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు ఇబ్బంది పడకుండా ఈ ఏర్పాట్లు చేశారు.
అన్నిటికంటే హైలైట్ ఈ కోచ్ లోని బెడ్ రూమ్స్. ఒకటా రెండా.. వరుసగా నాలుగు బెడ్ రూమ్స్ ఉన్నాయి. ప్రతి గదిలోనూ సౌకర్యవంతమైన మంచం, టీవీ, టేబుల్, కుర్చీలు ఉన్నాయి. ఎండాకాలం కోసం ఏసీలు, కూలర్లు కూడా అమర్చారు. గదుల్లో సామాన్లు పెట్టుకోవడానికి ప్రత్యేకమైన అల్మారాలు కూడా ఉండటం విశేషం. ఒక అల్ట్రా లగ్జరీ సూట్ రూమ్ లాంటి సౌకర్యాలతో ఉన్న ఈ కోచ్ వీడియో ఇప్పుడు 16 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది.
రైల్వే ట్రాక్ మెషిన్ స్టాఫ్ తరచూ అటవీ ప్రాంతాల్లో లేదా జనావాసాలకు దూరంగా పని చేయాల్సి ఉంటుంది. అప్పుడు వారు ఉండటానికి సరైన వసతి దొరకదు. అలాంటి సమయంలో ఈ క్యాంపింగ్ కోచ్‌లు వారికి ఒక గూడులా పని చేస్తాయి. రైల్వే శాఖ తన ఉద్యోగుల కోసం ఇంతటి అత్యాధునిక వసతులు కల్పిస్తుందని తెలియని సామాన్యులు ఇప్పుడు ఈ వీడియో చూసి "అవకాశం ఉంటే మాకూ ఒక్క రోజు అక్కడ ఉండాలని ఉంది" అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.