Viral Video: ఇలాంటి భార్య ఉంటే ఎంతటి ఒత్తిడైనా బలదూర్‌ అవ్వాల్సిందే.. వైరల్‌ వీడియో..!

Viral Video: ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. మానసిక శ్రమ తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి.

Update: 2025-02-24 11:42 GMT

Viral Video: ఇలాంటి భార్య ఉంటే ఎంతటి ఒత్తిడైనా బలదూర్‌ అవ్వాల్సిందే.. వైరల్‌ వీడియో..!

Husbands Stress Melts Away as Wife Welcomes Him with a Dance

Viral Video: ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. మానసిక శ్రమ తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. శారీరక శ్రమ తగ్గింది కానీ, మానసిక శ్రమ పెరిగింది. విపరీతమైన ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. ఒళ్లు నలగకుండా ఏసీ గదుల్లో కూర్చుంటున్నారనే కానీ తెలియని మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు. డెడ్‌ లైన్స్, టార్గెట్స్‌ ఇలా మానసికంగా కుంగిపోతున్నారు.

దానికి తోడు ఈ పట్టణాల్లో ఉండే ట్రాఫిక్‌. ఆఫీస్‌ నుంచి ఇంటికి వెళ్లే సరికి నీరసంగా మారిపోతుంటారు. అయితే ఇంటికి రాగానే ఇంట్లో కూడా వాతావరణం మూడీగా ఉంటే ఇక అలాంటి వారి కష్టం పగవాడికి కూడా రాకూడదని చెప్పడంలో సందేహం లేదు. అయితే తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే. నిజంగా ఇలాంటి భార్య ఉంటే ఎంత ఒత్తిడి అయినా బలదూర్‌ అవ్వాల్సిందే కదా అనిపించేలా ఉంది.

వివరాల్లోకి వెళ్తే.. ఆఫీసుకు వెళ్లిన తన భార్య రాక కోసం ఎదురు చూస్తుంటుంది ఓ భార్య. వర్క్‌ టెన్షన్‌తో ఎంతో నీరసంగా వచ్చే తన భర్తలో జోష్‌ పెంచాలని డిసైడ్‌ అవుతుంది. అందుకు అనుగుణంగానే భర్త వచ్చే సరికి మంచి పాట ప్లే చేసి డ్యాన్స్‌ చేస్తుంటుంది. ఇదంతా సీక్రెట్‌గా కెమెరాలో రికార్డ్‌ చేసింది. వచ్చే రాగానే భార్య హ్యాపీ మూడ్‌లో ఉండడం చూసిన భర్త ఫుల్‌ ఖుషీ అవుతాడు. భార్యతో కలిసి స్టెప్పులేస్తాడు.

ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. ఇప్పటికే సుమారు 80 లక్షల మంది ఈ వీడియో చూశారు. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. నిజంగా ఇలాంటి భార్య ఉంటే ప్రతీ రోజూ పండగే అంటూ స్పందిస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. 


Tags:    

Similar News