Viral Video: నా మొగుడ్ని చంపేస్తారా..? తప్పతాగి నడి రోడ్డు మీద యువ జంట హల్ చల్.. వీడియో వైరల్

Viral Video: చత్తీస్‌గఢ్‌లో యువ జంట రోడ్డుమీద మద్యం మత్తులో హంగామా.. పోలీసుల ఎదుటే దురుసు ప్రవర్తన.. వీడియోను చూసి నెటిజన్లు షాక్

Update: 2025-07-09 07:10 GMT

Viral Video: నా మొగుడ్ని చంపేస్తారా..? తప్పతాగి నడి రోడ్డు మీద యువ జంట హల్ చల్.. వీడియో వైరల్

Viral Video: ఇటీవల యువత లోని నిర్లక్ష్యపు ప్రవర్తన ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రాత్రివేళలు మద్యం మత్తులో రోడ్లపై హంగామాలు చేయడం, ఇతరుల ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టడం పరిపాటిగా మారుతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బాలో చోటు చేసుకున్న ఒక ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.

ఒక యువతీ, యువకులు కలిసి స్కూటీపై రాత్రి రోడ్డుమీదికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. మద్యం మత్తులో ట్రాఫిక్‌ను అడ్డుకోవడమే కాకుండా, విధుల్లో ఉన్న పోలీసులను నిలదీశారు. వారు హంగామా చేయడం గమనించిన పోలీసులు వారిని శాంతించేందుకు ప్రయత్నించగా, యువతి "నా మొగుడ్ని చంపేస్తారా?" అంటూ గొడవకు దిగింది.

పోలీసులు చెప్పినా వినక.. ఆ జంట మరింత రెచ్చిపోయారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మహిళ తన భర్తను రక్షించేందుకు పోలీసులతో తగాదా పడుతూ దురుసుగా ప్రవర్తించింది. వారు చేసే హంగామాను రోడ్డుమీదే ఉన్న కొంతమంది ప్రజలు తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు "ఇలాంటి మత్తు మానవత్వాన్ని మింగేస్తోంది" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు "ఇవాళ తప్పతాగి రచ్చ.. రేపు ప్రాణాలపైనే ప్రమాదం!" అంటూ హెచ్చరిస్తున్నారు.



Tags:    

Similar News