Viral Video: ఒకేచోట పదుల సంఖ్యలో మోసళ్లు.. ఆ సౌండ్ వింటే దడుసుకోవాల్సిందే..!
Viral Video: మోసళ్లు.. ఈ పేరు చెప్తేనే ఏదో తెలియని భయం వేయడం ఖాయం. వాటి రూపం గుర్తొస్తేనే ఎక్కడ లేని హడల్ ఉంటుంది.
Viral Video: ఒకేచోట పదుల సంఖ్యలో మోసళ్లు.. ఆ సౌండ్ వింటే దడుసుకోవాల్సిందే..!
Viral Video: మోసళ్లు.. ఈ పేరు చెప్తేనే ఏదో తెలియని భయం వేయడం ఖాయం. వాటి రూపం గుర్తొస్తేనే ఎక్కడ లేని హడల్ ఉంటుంది. అయితే వీటికి సంబంధించిన వీడియోలకు సోషల్ మీడియాలో భారీగా క్రేజ్ ఉంటుంది. చాలా అరుదుగా చూస్తాం కాబట్టే మొసళ్లు అంటే అదో రకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. తాజాగా మోసళ్లకు సంబంధించి ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మోసళ్ల రూపమే కాదు వాటి అరుపులు కూడా భయపెట్టిచ్చేలా ఉంటాయని చెప్పేందుకు ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ఓర్లాండ్‌లోని ఓ రిజర్వాయర్‌లో కొన్ని మొసళ్లు ఒకచోట చేరాయి. సరాదాగా స్విమ్మింగ్ చేస్తున్నట్లు ఒక ఒకచోట చేరి ఎంజాయ్ చేస్తున్నాయి. అయితే కాసేపటికి వాటికి ఏమైందో ఏమో కానీ ఒక్కొక్కటి అరవడం మొదలు పెట్టాయి. ఒకదాని తర్వాత మరొకటి వింత శబ్ధాలు చేశాయి. అయితే వినడానికి ఈ శబ్ధాలు చాలా వింతగా ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సింహం గర్జిస్తున్నట్లు ఉండడం గమనార్హం. సాధారణంగా మోసళ్లు ఇలాంటి శబ్ధాలు చేయడం అరుదైన విషయమనే చెప్పాలి.
దీంతో దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెద్ద ఎత్తున నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ‘‘మొసళ్లు ఇలా గర్జించడం ఇప్పుడే చూస్తున్నాం’’ అంటూ కొందరు కామెంట్స్ చేయగా. మరికొందరు స్పందిస్తూ ఈ సౌండ్ వింటే సింహాలు కూడా దడుసుకోవడం ఖాయమని అంటున్నారు. మొత్తం మీద ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఎక్స్ వేదికగా ఈ వీడియోను పోస్ట్ చేయగా వేలల్లో లైక్స్ కామెంట్స్ వస్తున్నాయి. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.